మీడియా అంటే సమాజంలో అవినీతిపైన, అరాచకాలపైన, అన్నింటిపైనా మంటలు పుట్టిస్తుంది. అన్ని విషయాల్లోనూ పారదర్శకత కోరుకుంటూ, జనాలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటూ ఉంటాయి. అన్ని మీడియాల్లో వ్యవహారం ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామిగా కొనసాగుతున్న 'ఈనాడు' మాత్రం తామే సుప్రీం అన్నట్టుగా వ్యవహరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తమ మీడియాలో వచ్చిన వార్తకు మాత్రమే విశ్వసనీయత ఉందని, ప్రభుత్వాలు కూడా వాటినే తప్పకుండా పాటించాలి అన్నట్టుగా ఈనాడు మొదటి నుంచి వ్యవహరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అసలు అటువంటి ఈనాడులో ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం కన్నా, ఎక్కువ అన్నట్టుగా బయట జనాలు ఫీలింగ్. దానికి తగ్గట్టుగానే అక్కడ ఆ విధంగా ఉద్యోగులకు భరోసా ఉంటూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ భరోసా ఎక్కడా కనిపించడంలేదు. 

 

IHG


ఈనాడు వ్యవహారంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ లాభాల్లో నడుస్తున్న ఈనాడు యాజమాన్యం ఎప్పటి నుంచో ఉద్యోగులను తగ్గించుకునే పనిలో ఉంది. సరిగ్గా ఇదే సమయంలో కరోనా వైరస్ మహమ్మారి ఈనాడు కు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ఇప్పటికే చాలా మంది ఉద్యోగులను ఈ వైరస్ పేరు చెప్పి తప్పించిన ఈనాడు, తాజాగా 20 మంది ఉద్యోగులను తప్పించడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. మొదటిసారిగా ఇంతమందిని ఒకేసారి ఇంతమందిని తప్పించడం ఈనాడు చరిత్రలోనే మొదటిసారి. ఈనాడులో పదవీ విరమణ చేసిన తరువాత కూడా సగం జీవితంతో పనిచేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. వారిలో 20 మందిని ఇక రానవసరం లేదని చెప్పేశారట. వాళ్లంతా పేజ్ మేకప్ విభాగానికి చెందిన వారు. 

 


కరోనా కారణంగా ఈనాడు పేజీలు తగ్గించడంతో సిబ్బందిని తగ్గించుకునే అవకాశం దొరికింది. వీరే కాకుండా  ప్రతి జిల్లా డెస్క్ లలోనూ ఉన్న సిబ్బందిని సగం వరకు తగ్గించుకునే పనిలో ఈనాడు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇక స్పెషల్ పేజీల నిమిత్తం ఇప్పటికే చాలా మందిని కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకుంది ఈనాడు.అయితే వారందరినీ తప్పించే పనిలో ఈనాడు ఉన్నట్లు తెలుస్తోంది. వారికి యాజమాన్యం నుంచి ఎప్పుడు ఏ కబురు వస్తుందో తెలియని ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది.ఈనాడు పరిస్థితి ఇలా ఉంటే, ఆంధ్రజ్యోతిలో పరిస్థితి మరీ దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

 

ఎడాపెడా ఉద్యోగాల్లో కోత విధిస్తూ వస్తోంది.ఇప్పటికే 25 శాతం మందిని తప్పించినట్లు తెలుస్తోంది. అసలు మీడియాలో ఉద్యోగం అంటేనే దిన దిన గండం, నూరేళ్ళళు ఆయుష్షు అన్నట్టుగా మారిపోయింది. జీతాల గురించి, ఉద్యోగ భద్రత గురించి అందరిపైనా వార్తలను వండి వార్చే మీడియా సిబ్బందికి మాత్రం...  తమ బాధ చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: