ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కు పరిపాలనలో సహకరించే విధంగా ఇబ్బడిముబ్బడిగా సలహాదారులను నియమించుకున్నారు. అయితే జగన్ కు  సలహాలు ఇవ్వడం కానీ, వారు ఇచ్చిన తీసుకునే పరిస్థితుల్లో జగన్ లేకపోవడం వంటి కారణాలతో వారి ఉపయోగం పెద్దగా ప్రభుత్వానికి లేదన్నట్టుగా వారి వ్యవహారం నడుస్తోంది.అయినా అనేకమంది సలహాదారులను జగన్ నియమించుకున్నారు. అయితే వారు మాట ఆయన వింటున్నారా ? వారికి అవకాశం ఇస్తున్నారా అనే సంగతి పక్కన పెడితే... ప్రస్తుతం జగన్ సలహాదారులో ఒకరిగా ఉన్న రామచంద్ర మూర్తి తన సలహాదారు పదవికి రాజీనామా చేసినట్లు రెండు రోజులుగా సోషల్ మీడియాతో పాటు అనేక వెబ్ మీడియాలో వార్తాకథనాలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై ఆయన ఎక్కడా స్పందించలేదు. అలా అని నిజంగానే సలహాదారు పదవికి రాజీనామా చేశారా అంటే అది లేదు. అయితే తనకు పెద్దగా పని లేకుండా ఆ పదవిలో కొనసాగడం ఇష్టం లేక తాను రాజీనామా చేస్తానని జగన్ కు చెప్పేందుకు ఆయన ప్రయత్నిస్తున్నా, ఆ  అవకాశం ఆయనకు దక్కకపోవడం లేదట.

 

IHG


 జగన్ కు అత్యంత దగ్గరగా ఉండే ఒకరిద్దరు నాయకులు వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే వారు కూడా జగన్ వద్ద ఈ విషయాన్ని చెప్పినట్టుగా కనిపించకపోవడంతో దీనిపై ఎటువంటి కదలిక లేకుండా పోయింది. సలహాదారులు సాంప్రదాయం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో మొదలైంది. రాజశేఖర్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులను సలహాదారుగా నియమించుకున్నాడు. అయితే వారు ఇచ్చిన సలహాలను ఆయన పాటించడా లేదా  అన్న సంగతి పక్కన పెడితే వారికి ఏదో ఒక ఉపాధి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ పోస్టులు సృష్టించినట్టుగా దుమారం చెలరేగింది. ఇప్పుడు కూడా జగన్ ప్రభుత్వంలో సలహాదారులు పరిస్థితి అదే విధంగా ఉంది. అయితే మిగతా అందరి కంటే తాను భిన్నం అన్నట్టుగా ప్రస్తుత జగన్ సలహాదారులలో ఒకరైన శ్రీరామచంద్రమూర్తి భావిస్తున్నారట. 

 

తన సలహాలు జగన్ కు అవసరం లేనప్పుడు తాను స్వయంగా కలిసి ఏదైనా విషయం చెప్పాలి అనుకున్నా అది సాధ్యపడనప్పుడు, అసలు జగన్ అపాయింట్మెంట్ తనకు లభించనప్పుడు తాను ఈ పదవిలో ఉండి ఉపయోగం లేదనే ఆలోచనా ధోరణికి శ్రీరామచంద్రమూర్తి వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవంగానే జగన్ తాను అనుకున్నది తప్ప ఎవరి మాట వినే రకం కాదన్న సంగతి ఆ పార్టీ శ్రేణులకు, జగన్ ను మొదటి నుంచి అనుసరిస్తూ వస్తున్న వారికి బాగా తెలుసు. ఇక అలాంటప్పుడు సలహాదారుల అవసరం జగన్ కు ఎందుకు ఉంటుంది ? అయినా మరి కొంతమందిని నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు తప్ప ఎవరిని ఆ పదవి నుంచి తొలగించేందుకు జగన్ ఇష్టపడడం లేదు. 

 


రామచంద్రమూర్తి అంటే ఓ ప్రజాస్వామ్య వాదిగా, తటస్థ, క్లిన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. ఆయన గతంలో సాక్షి కి ఎడిటోరియల్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. అయితే అప్పట్లోనే ఆయన వ్యవహారం వైసిపి నాయకులకు నచ్చకపోవడంతో ఆయనే స్వయంగా సాక్షి నుంచి బయటికి వచ్చేశారు. మళ్లీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను తీసుకువచ్చి సలహాదారు పదవి కట్టబెట్టారు. ఇదే విధంగా గా ప్రెస్ అకాడమీ చైర్మన్ గా రెండు పర్యాయాలు పనిచేసిన దేవులపల్లి అమర్ ప్రస్తుతం జగన్ సలహాదారులలో ఉన్నారు. ఆయన గతంలో సాక్షి చానల్ లో పని చేసిన అనుభవం ఉంది. అమర్ కు  జగన్ వ్యవహారాలు మొదటి నుంచి బాగా తెలుసు కాబట్టి జగన్ తో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు. అయితే శ్రీరామచంద్రమూర్తి వ్యవహారం దానికి పూర్తిగా విరుద్ధం. 

 

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియా విషయంలో తీసుకున్న అత్యంత వివాదాస్పద నిర్ణయంగా చెప్పబడుతున్న 2430 జీవోను రామచంద్రమూర్తి తప్పనిసరై సమర్ధించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఆయన ఇమేజ్ కు  కాస్త డ్యామేజ్ కలిగించింది. అంతే కాదు ప్రస్తుతం రామచంద్రమూర్తి మూడు నెలలుగా  జీతం తీసుకోవడం లేదంటూ మీడియా సర్కిళ్లలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. తాను సలహాలు ఇచ్చే స్థితిలో లేనప్పుడు, తను సలహాలు పని చేయనప్పుడు, కనీసం జగన్ ను కలిసేందుకు అవకాశం లేనప్పుడు ఖాళీగా జీతం తీసుకోవడం కరెక్ట్ కాదని భావించి ఆయన జీతం కూడా తీసుకోవడానికి ఇష్టపడటం లేదట. ఇక ఆయన తన పదవికి రాజీనామా చేయకపోయినా, రాజీనామా చేసినట్టుగానే దూరంగా ఉంటున్నారు. అయితే ఈయన వ్యవహారం జగన్ దృష్టికి ఇప్పటి వరకు వెళ్లిందో లేదో ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: