రాష్ట్రమంతటా పార్టీ పరిస్దితి ఎలాగున్నా సొంత జిల్లాలో పార్టీ పరిస్ధితి మాత్రం ఘోరంగా తయారైందని సమాచారం.  అధికారం కోల్పోయిన తర్వాత నుండి పార్టీలోని సీనియర్లు పెద్దగా యాక్టివ్ గా కనబడటం లేదు. ఈమధ్యనే పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులను నియమించిన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో మిగిలిన జిల్లాల మాట ఎలాగున్నా సొంత జిల్లా చిత్తూరులో మాత్రం పార్టీ పరిస్ధితి అధ్వాన్నంగానే ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గానికి ఇన్చార్జిలుగా నియమించటానికి పార్టీ తరపున నేతలే దొరకటం లేదట.  అధికారంలో ఉన్నంత కాలం పార్టీ చెప్పుకుని, చంద్రబాబు పేరు చెప్పుకుని ఆకాశమంతగా చెలరేగిపోయిన చాలామంది నేతలు ఇపుడు ఎక్కడా అడ్రస్ కనబడటం లేదని పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. చిత్తూరు పార్లమెంటు అధ్యక్షునిగా నియమితుడైన పులివర్తి నాని,  ప్రకాశం జిల్లాకు చెందిన  సమన్వకర్త ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశం ఎందుకయ్యా అంటే నియోజకవర్గాల్లో సమన్వయకర్తల నియామకంపై నేతలతో సమావేశం ఏర్పాటు చేశారట.




అయితే నాని, ఉగ్రనరసింహారెడ్డితో పాటు కేవలం చాలా కొద్ది మంది మాత్రమే నేతలు హాజరయ్యారట. దాంతో ఉగ్రనరసింహారెడ్డి ఆశ్చర్యపోయారట. ఇదే సందర్భంగా నియోజకవర్గాల్లో ఇన్చార్జిలుగా ఉండటానికి నేతల్లో చాలామంది ముందుకు రావటం లేదనే విషయంపై చర్చ జరిగింది. అధికారంలో ఉన్నపుడు రెచ్చిపోయిన చాలామంది ఇపుడు పార్టీ కార్యక్రమాల్లో కనబడకపోతే ఇక ఇన్చార్జిలను ఎలా నియమించాలంటూ నేతలు గట్టిగానే పులివర్తి నానిని నిలదీశారట. నాని బదులిస్తు ఉన్న వాళ్ళల్లోనే కొందరితో మాట్లాడి కన్వీన్స్ చేసి పేర్లిస్తే వాటినే చంద్రబాబునాయుడుకు పంపి ఇన్చార్జిలుగా ప్రకటింపచేస్తామని చెప్పారట.




చిత్తూరులో మాజీ ఎంఎల్ఏ ఏఎస్ మనోహర్ ఈమధ్యనే పార్టీకి రాజీనామా చేసేశారు. మళ్ళీ ఇక్కడ గట్టి నేతెవరు యాక్టివ్ గా లేరు. అలాగే చిత్తూరు మాజీ ఎంఎల్ఏ డీకే సత్యప్రభ కూడా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనటం లేదు. ఇలాంటి ఈమెను చంద్రబాబు జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించినట్లు గుర్తు చేశారట. పూతలపట్టులో మాజీ ఎంఎల్ఏ లలితకుమారి, గంగాధరనెల్లూరులో మాజీ మంత్రి కుతూహలమ్మ కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేరట. ఇలా ఏ విధంగా చూసినా నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా పనిచేయటానికి చాలామంది ఇష్టపడటం లేదని అర్ధమవుతోంది. కుప్పంలో స్వయంగా ఎంఎల్ఏగా చంద్రబాబే ఉన్నా ఇక్కడ ఎవరిని నియమించాలో నేతలకు తోచటం లేదు. ఎందుకంటే ఎక్కడో హైదరాబాద్ లోనో లేకపోతే అమరావతిలోనో కూర్చునే చంద్రబాబు ప్రతిరోజు నియోజకవర్గాన్ని సమన్వయం చేసుకోవటం సాధ్యంకాదు.


ఇక శ్రీకాళహస్తి, పలమనేరులో మాజీ మంత్రులు gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల గోపాలకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కొడుకు gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డి, మాజీమంత్రి అమరనాధరెడ్డి లాంటి చాలామంది నేతలు క్యాడర్ ఆశిస్తున్నట్లుగా చురుగ్గా లేరన్నది వాస్తవం. పుంగనూరులో పోటి చేసి ఓడిపోయిన మాజీ మంత్రి అమరనాధరెడ్డి మరదలు అనూష్కారెడ్డి కూడా ఎక్కువగా బెంగుళూరులోనే ఉంటున్నారు. కాబట్టి స్ధానిక నేతలతో సమన్వయం సాధ్యం కావటం లేదు. ఇక తిరుపతిలో చాలామందే సీనియర్లున్నా ఎవరు చురుగ్గా తిరగటం లేదు. చంద్రబాబు సొంతజిల్లా చిత్తూరులోనే పరిస్ధితి ఇంత దీనంగా ఉంటే ఇక మిగిలిన రాష్ట్రం సంగతి చెప్పేదేముంది ?

మరింత సమాచారం తెలుసుకోండి: