గతం కంటే భిన్నంగా, తెలంగాణ ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 2014 నుంచి టిఆర్ఎస్ పార్టీని ఆదరిస్తూ వస్తున్న జనాలు ఇప్పుడిప్పుడే బిజెపి వైపు మొగ్గు చూపుతున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు బిజెపి అంటే తెలంగాణలో ఎప్పటికైనా బలం పుంజుకుంటుందని అభిప్రాయాలు నుంచి టిఆర్ఎస్ పార్టీ కి పోటీ ఇచ్చే స్థాయి వరకు ఆ పార్టీ ఎదిగి చూపించింది. దీంతో బిజెపిపై అనుమానాలు ఒక్కసారిగా తొలగిపోయింది. దీనికి తోడు దుబ్బాక ఉప ఎన్నికలలో గెలిచి చూపించి బిజెపి తన సత్తా ఏంటో ఆ పార్టీ చాటి చూపించింది. మొన్నటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉంది అని అంతా అంచనా వేయగా , కాంగ్రెస్ పార్టీని పక్కకునెట్టి బిజెపి ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీ నేతలు బిజెపి ని చూసి కంగారు పడే పరిస్థితి వరకు బిజెపి ఎదిగింది. తన సత్తా నిరూపించుకుంటూ వస్తోంది.




 గ్రేటర్ ఎన్నికలలోనూ టిఆర్ఎస్ పార్టీ కి గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. వివిధ సర్వేల లెక్కల ప్రకారం 60కి పైగా స్థానాలు బిజెపి సొంతం చేసుకుంటుందనే లెక్కలు బయటకు రావడం, ఆ పార్టీ నేతలలో మరింత హుషారును పెంచాయి. ఇది ఇలా ఉంటే, అనూహ్యంగా వచ్చిన ఈ క్రేజ్ ను ఉపయోగించుకుని బీజేపీ అధికారం వైపు అడుగులు వేసే దిశగా బలం పెంచుకునే విషయంపై దృష్టి పెట్టకుండా, నాయకులు నోటిదురుసు రాజకీయాల కారణంగా,  ఎక్కడ లేని ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్న ట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా దుబ్బాక ఉప ఎన్నికలలో గెలిచిన ఎమ్మెల్యే రఘునందన్ రావు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.




 పావురాలగట్టలో వైఎస్ మరణాన్ని ప్రస్తావిస్తూ , సర్జికల్ స్ట్రైక్ వ్యవహారాల పైన మాట్లాడుతూ కావలసినంత వివాదాన్ని ఆయన బీజేపీకి తెచ్చిపెట్టారు. వైయస్సార్ పై ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతూ, తెలంగాణలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో బీజేపీకి రఘునందన్ రావు కు వ్యతిరేకంగా ధర్నాలు చేయడం వంటి వ్యవహారాలతో బిజెపి ఇరుకున పడింది. గ్రేటర్ ఎన్నికల కీలక సమయంలో ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా రాజశేఖరరెడ్డి అభిమానులు వ్యతిరేకతను బిజెపి మూట కట్టుకోవలసి వచ్చింది. అలాగే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సైతం పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్థానీయులు ఉన్నారని విమర్శలు చేసి రాజకీయంగా లబ్ధి పొందుదామని చూసినా, టీఆర్ఎస్ ,ఎంఐఎం పార్టీలు బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేయడం ప్రజల్లోనూ ఇతర అభిప్రాయాలు అడగడంతో బిజెపి చిక్కుల్లో పడింది.




 కేవలం అధికారంలోకి రావాలన్న తపనతో ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న  అవన్నీ బిజెపి ఓటు బ్యాంకును దెబ్బతీస్తున్న ట్టుగానే కనిపిస్తున్నాయి. ఎక్కడ ప్రతిపక్షాల కుట్రర అయితే ఏమీ లేదు. స్వయంగా బిజెపి నాయకులు తమ పార్టీ కి ఇబ్బంది కలిగే విధంగా , నష్టం జరిగే విధంగా చేసుకున్న స్వయంకృతాపరాధాలు మాత్రమే కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: