అవును మీరు చదివింది నిజమే. ఒకవైపు తెలంగాణా బిడ్డ పీవీ నరసింహారావును ఆకాశానికి ఎత్తేస్తూనే మళ్ళీ ఆయన ప్రతిష్ట మసకబారేట్లు చేస్తున్నారు కేసీయార్. దీనికంతటికి కారణం ఏమిటంటే పీవీ కూతురు సురభి వాణీదేవిని టీఆర్ఎస్ తరపున హైరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఎంఎల్సీ ఎన్నికల్లో పోటికి దింపటమే. వాణిదేవిని కేసీయార్ ఏ ఉద్దేశ్యంతో ఎన్నికల్లోకి దింపారన్నది వేరే విషయం. కానీ ఇపుడు ఆమె ప్రొజెక్టవుతున్నది మాత్రం బ్రాహ్మణ కులం ప్రతినిధిగా. వాణి అభ్యర్ధిత్వాన్ని కేసీయార్ ప్రకటించి, ఆమె నామినేషన్ వేయగానే ఆర్చక, పురోహిత సంఘాలు ఆమెకు మద్దతుపలుకుతు, కేసీయార్ ను అభినందించాయి.




నిజానికి వాణి విషయంలో సామాజికవర్గానికి కాకుండా మాజీ ప్రధానమంత్రి పీవీ కూతురుగా కేసీయారే ఓ మాట చెప్పుంటే బాగుండేది. వాణిని ఎంపిక చేయటం వరకు కరెక్టే కావచ్చు కానీ తర్వాత జరుగుతున్న ప్రచారమే ఆమెకు డ్యామేజ్ అవుతోంది. ఎందుకంటే ఇదే స్ధానానికి పోటీ చేస్తున్న రామ చంద్రరావు, కపిలవాయి దిలీప్ కూడా బ్రాహ్మణులే. వాణికి మద్దతు ప్రకటించిన అర్చక, పురోహిత సంఘాల్లో ఎంతమందికి ఓట్లున్నాయో తెలీదు. వారి అత్యుత్సాహం వల్ల బ్రాహ్మణ సామాజికవర్గానికి వ్యతిరేకంగా ఇతర సామాజికవర్గాలు ఏకమైతే అప్పుడు ఆమె పరిస్దితి ఏమిటి ? పోనీ పోటీలో ఉన్నవారిలో ఆమె ఒక్కతే బ్రాహ్మిన్ అనుకునేందుకు కూడా లేదు కదా. పైగా ఆమె రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యక్షంగా పోటీ చేయటం ఇదే మొదటిసారి.




పైగా పీవీని టీఆర్ఎస్ నేతలు తెలంగాణా ముద్దుబిడ్డగా ప్రొజెక్టు చేస్తున్నారు. అది కూడా పీవీ ఖ్యాతిని బజారులోకి లాగేసేదే. ఎలాగంటే టీఆర్ఎస్ కు కౌంటరుగా ఎప్పుడో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమానికి పీవీ నిధుల సాయం చేశారంటు ప్రచారం మొదలుపెట్టింది. పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రత్యేక తెలంగాణా, సమైక్యాంధ్ర ఉద్యమాలు జరిగాయి. అయితే పీవీ మాత్రం సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా పెద్ద ఎత్తున నిధులు సర్దుబాటు చేశారని అప్పట్లో పీవీ కార్యదర్శిగా పనిచేసిన పీవీఆర్కే ప్రసాద్ రాసిన పుస్తకంలోని అంశాన్ని ఇపుడు టీఆర్ఎస్ ప్రచారంలోకి తెచ్చింది. అంటే ఇటు బ్రాహ్మణ వాదనకు, అటు తెలంగాణా ముద్దుబిడ్డ అనే వాదన కూడా తేలిపోతున్నాయి. మరి అన్నీ తెలిసి కూడా వాణిదేవిని కేసీయార్ ఎందుకు సీన్ లోకి తెచ్చినట్లు ?

మరింత సమాచారం తెలుసుకోండి: