కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉదృతి నేపధ్యంలో వారం రోజుల క్రితం భారత్ కు సాయం అందించేందుకు అగ్రరాజ్యం అమెరికా ససేమిరా అన్నది. వ్యాక్సినేషన్ తయారికి అవసరమైన ముడిపదార్ధాలను సరఫరా నిలిపేస్తామని చెప్పింది. ఆక్సిజన్, వెంటిలేటర్ల తయారీలో ఉపయోగించే పరికరాలను కూడా నిలిపేసింది. అమెరికాలో తయారయ్యే టీకాల సరఫరాపైన బ్యాన్ పెట్టింది. మొత్తానికి కరోనా వైరస్ సంక్షోభంతో నానా అవస్తలు పడుతున్న భారత్ పై ఆంక్షలు, బ్యాన్ తో అమెరికా విరుచుకుపడింది. సీన్ కట్ చేస్తే తాజాగా టీకాల తయారీకి అవసరమైన ముడిపదార్ధాలను సరఫరా చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. వెంటిలేటర్లు, ఆక్సిజన్ ఎక్విప్మెంట్ తయారీలో అవసరమైన వాటిని అందిస్తామని ప్రకటించింది. సాంకేతిక, శిక్షణ, రెమ్ డెసివిర్ మందులను కూడా అందిస్తామని హామీఇచ్చింది. కోవీషీల్డ్ తయారీకి అవసరమైన ముడిసరుకును కూడా వెంటనే భారత్ కు పంపిస్తామని ప్రకటించింది. తమ టీకాల తయారీకోసమని తెప్పించుకుని వనరులను కూడా భారత్ కు పంపుతున్నట్లు చెప్పింది.





పై రెండు ప్రకటనల మధ్య గ్యాప్ మహాఉంటే ఓ వారం రోజులుంటుంది. మరి మొదటి ప్రకటనకు రెండో ప్రకటనకు మధ్య ఎందుకింత తేడా వచ్చింది. మొదటి ప్రకటనలో ఏమో భారత్ ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా అమెరికా వ్యవహరించింది. రెండో ప్రకటనలో భారత్ కోసం దేన్నైనా త్యాగం చేయటానికి సిద్ధమన్నట్లుగా అమెరికా చెప్పింది. మరి రెండు ప్రకటనల్లోను ఎందుకింత తేడా ఉంది. రెండు ప్రకటనల మధ్యలో అసలేం జరిగింది ? ఏమి జరిగిందంటే మొదటి ప్రకటన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడి, విదేశాంగ శాఖ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాట్లాడుకున్నారట. వాళ్ళొక నిర్ణయానికి వచ్చిన తర్వాత దోవల్ రంగంలోకి దిగారట. అమెరికా విదేశాంగ మంత్రితోను, అమెరికా విదేశాంగ, రక్షణ సలహాదారులతో మాట్లాడారట. మాట్లాడటం కూడా మామూలుగా కాదు. చాలా స్పష్టంగా, తమపై ఆంక్షలను తొలగించకపోతే జరగబోయే పరిణామాలను వివరిస్తు హెచ్చరించినట్లు సమాచారం.




కోవిడ్ సమస్యను ఇపుడు కాకపోయినా మరికొంత కాలం తర్వాతైనా భారత్ అధిగమిస్తుంది. కానీ ఇదే సమయంలో భారత్ మార్కెట్ ను అమెరికా శాశ్వతంగా కోల్పోవాల్సుంటుందని దోవల్ హెచ్చరించారట. ఏరకంగా చూసినా అమెరికా మీద మనదేశం ఆధారపడటం కన్నా మనదేశం మీద అమెరికా ఆధారపడిందే చాలా చాలా ఎక్కువ. ప్రపంచమార్కెట్లో అమెరికాకు మనదేశం కామధేనువు లాంటిది. సరిగ్గా ఈ విషయం మీదే దోవల్ అమెరికాను గట్టిగా నొక్కారట. దాంతో భవిష్యత్తును ఆలోచించుకున్న అమెరికా వెంటనే మనతో కాళ్ళబేరానికి వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: