జాతీయస్ధాయిలోని ఒక పార్టీకేమో వంద సంవత్సరాలు దాటిపోయింది. అలాగే రాష్ట్రస్ధాయిలోని మరోపార్టీకేమో 40 ఏళ్ళు దాటిపోయింది. ఈ కారణంగానే పాత తరాన్ని వదిలించుకోలేక, కొత్త తరాన్ని ఆహ్వానిచలేక చతికలపడిపోతున్నాయి. అయినా రెండుపార్టీల అధినేతల్లో మార్పులు మాత్రం రావటంలేదు. ఈ కారణంగానే జనాలకు మెల్లిగా దూరమైపోతున్నాయి. ఇంతకీ పై రెండుపార్టీలు ఏవో ఈపాటికే అర్ధమైపోయుండాలి. అవును ఒకటేమో జాతీయ కాంగ్రెస్ పార్టీ రెండోదేమో ఏపిలో తెలుగుదేశంపార్టీ. రెండుపార్టీల్లోను వృద్ధనేతలు చాలా ఎక్కువైపోయారు. ఎప్పుడో పార్టీ పెట్టినపుడో లేదా 70వ దశకంలోనో రాజకీయాల్లోకి ప్రవేశించిన వారే ఇపుడు కూడా రెండుపార్టీల్లోను ఆధిపత్యం చెలాయిస్తున్నారు. వీళ్ళ వల్ల కొత్తతరం నేతలు పార్టీల్లో నిలదొక్కుకోవటం చాలా కష్టంగా ఉంది. అందుకనే వృద్ధనేతలను తట్టుకోలేక యువనేతలు పార్టీలను వదిలేసి వెళ్ళటమే లేదా స్తబ్దుగా ఉండిపోవటమే చేస్తున్నారు. ఈ కారణంతోనే రెండుపార్టీలు జనాలకు దూరమైపోతున్నాయి.
ముందుగా కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే 70వ దశకంలో రాజకీయాల్లోకి ప్రవేశించిన గులాంనబీ ఆజాద్, కమలనాధ్, అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్, మల్లికార్జున ఖర్గే, జై రాం రమేష్ లాంటి అనేకమంది వృద్ధ నేతలు పార్టీపరంగా కానీ అధికారంలో ఉన్నపుడు కానీ అపరిమతమైన అధికారాలను అనుభవించారు. అయితే బతికినంత కాలం తామే అన్నీ అనుభవించాలన్న స్వార్ధంతో యువనేతలకు చోటు ఇవ్వలేదు. దీని ఫలితంగా 2014లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి అన్నీ ఎదురుదెబ్బలే. రాష్ట్రాల్లో తిరిగి ప్రచారంచేసి పార్టీని అధికారంలోకి తెచ్చేంత సీన్ వీళ్ళకు లేదని తేలిపోయింది. ఇదే సమయంలో వీళ్ళను తట్టుకోలేక చాలా రాష్ట్రాల్లో యువనేతలు పార్టీని వదిలేశారు. దీని ఫలితంగా చాలా రాష్ట్రాల్లో పార్టీకి నాయకత్వమే లేకుండాపోయింది. మధ్యప్రదేశ్ లో 15 ఏళ్ళ తర్వాత అధికారంలోకి రావటంలో యువనేత జ్యోతిరాధిత్య సింధియాదే ప్రధాన పాత్ర. అయితే అధికారంలోకి రాగానే వృద్ధనేత కమలనాధ్ సిఎం అయిపోయారు. దాంతో ఇద్దరి మధ్య గొడవలు పెరిగిపోయి చివరకు సింధియా పార్టీని చీల్చేయటంతో పుట్టి ముణిగిపోయింది. వృద్ధనేతలందరినీ సోనియాగాంధి పక్కనపెట్టి అన్నీ రాష్ట్రాల్లో యువనేతలను ప్రోత్సహిస్తే కానీ లాభంలేదు.
అలాగే ఏపిలో టీడీపీ పరిస్ధితి కూడా దాదాపు ఇంతే. ఎప్పుడో 1982లో ఎన్టీయార్ పార్టీని పెట్టినపుడు రాజకీయాల్లోకి వచ్చిన వారే చాలా జిల్లాల్లో ఇప్పటికీ ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఎంఎల్ఏ, ఎంపి, మంత్రు పదవుల్లో ఏదైనా సరే తమకే కావాలనే స్వార్ధం పెరిగిపోయింది. దీనివల్ల యువనేతలు ఎదగలేకపోయారు. యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల గోపాలకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, అశోక్ గజపతిరాజు, కేఇ కృష్ణమూర్తి, reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి అనేకమంది సీనియర్లే అధికారంలో ఉన్నా లేకపోయినా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఏదైనా జిల్లాల్లో కొందరు యువనేతలున్నా వారు వారసత్వంగా వచ్చినవారే తప్ప పూర్తిగా కొత్త ముఖాలు కారు. యువనేతలు విసిగిపోయి 2019 ఎన్నికల్లో ఎదురైనా ఘోర ఓటమి తర్వాత పార్టీకి రాజీనామాలు చేసేశారు. ఉన్న కొందరు స్తబ్దుగా ఉంటున్నారు. మొత్తానికి జాతీయపార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా రెండు కూడా సేమ్ టు సేమ్ సమస్యతోనే అవస్తలు పడుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి