
కానీ జిల్లాల విభజన అలా చేయకుండా, 8 అసెంబ్లీ స్థానాలతో కొన్ని జిల్లాలని ఏర్పాటు చేశారు. అలా ప్రకాశం, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలని ఏర్పాటు చేశారు. అలాగే అనంతపురం జిల్లాని కూడా 8 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటు చేశారు. మామూలుగా అనంతపురం జిల్లాలో మొత్తం రెండు పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి...అనంత పార్లమెంట్ పరిధిలో రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, తాడిపత్రి, శింగనమల, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం స్థానాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కలిసి అనంత జిల్లాగా ఏర్పడ్డాయి.
ఇటు హిందూపురం పార్లమెంట్ పరిధిలో మడకశిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, రాప్తాడు స్థానాలు ఉన్నాయి. కానీ ఇక్కడ రాప్తాడుని తీసుకెళ్లి అనంతలో కలిపేశారు. ఇక 6 స్థానాలతో హిందూపురంని సత్యసాయి జిల్లాగా ఏర్పాటు చేశారు. పుట్టపర్తి కేంద్రంగా ఈ కొత్త జిల్లా ఏర్పాటు అయ్యింది. అయితే రాప్తాడు పరిటాల ఫ్యామిలీ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం..ఆ ఫ్యామిలీకి రాప్తాడుతో పాటు హిందూపురంలో పలు స్థానాలపై పట్టు ఉంది. ఇది హిందూపురం పార్లమెంటు పరిధిలో ఉంది.
ఇక పరిటాల ఫ్యామిలీకి ఇప్పటకి హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాస్తో కూస్తో పట్టు ఉండనే ఉంది. ధర్మవరం, పెనుకొండ లాంటి స్థానాల్లో బలం ఉంది...అంటే రాప్తాడుని అటు తీసుకెళితే..సత్యసాయి జిల్లాలో పరిటాల ఫ్యామిలీ డామినేషన్ పెరుగుతుంది. అందుకే అనుకుంటా రాప్తాడుని తీసుకెళ్లి అనంతలో పడేసి పరిటాల ఫ్యామిలీ బలం మీద దెబ్బకొట్టినట్లు కనిపిస్తున్నారు. మొత్తానికి జిల్లాల విభజనతో జగన్ రాజకీయంగా లబ్ది పొందాలని బాగానే ప్లాన్ చేశారు.