పుతిన్‌.. ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్రతిధ్వనిస్తున్న పేరు. ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించి.. ఆ దేశం అంతు చూసే వరకూ వదిలిపెట్టబోనంటున్న పుతిన్‌ ఇప్పుడు ప్రపంచ నియంతగా చాలా మంది భావిస్తున్నారు. అలాంటి పుతిన్‌ ఆరోగ్యం గురించి ఇప్పుడు కొత్త పుకార్లు షికారు చేస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.


పుతిన్‌కు రక్త కేన్సర్‌ ఉన్న విషయం తెలిసిందే. పుతిన్ ఆరోగ్యం బాగా దెబ్బ తిందని బ్రిటన్‌ మాజీ గూఢచారి క్రిస్టఫర్‌ స్టీల్‌ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే.. కచ్చితంగా పుతిన్‌ అనారోగ్య సమస్య ఏమిటనేది తెలియడం లేదట. పుతిన్ అనారోగ్యం నయమయ్యేదా, కాదా అనే విషయం తెలియదని.. కానీ ఆయన ఆరోగ్యం తీవ్రమైన ఇబ్బందుల్లో ఉందనే విషయం మాత్రం వాస్తవం అని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారట.


పుతిన్‌కు క్యాన్సర్ ఉందన్న విషయం తెలిసిందే. ఆ కేన్సర్‌ చికిత్సలో భాగంగా ఆయన వెన్నుకు కొన్నాళ్ల క్రితం ఆపరేషన్‌ చేశారట. అయితే.. అది సఫలం కాలేదని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధ ప్రకటనకు ముందు జరిగిన ఆపరేషన్‌ పూర్తిగా సక్సస్ కాలేదని అంటున్నారు. ఈ బ్రిటిష్ మాజీ గూఢచారి మాత్రమే కాకుండా.. మరొకరు కూడా పుతిన్ అనారోగ్యం గురించి మాట్లాడుతున్నారు. రష్యాకు చెందిన అత్యంత సంపన్న వ్యక్తి కూడా పుతిన్‌ అనారోగ్యం గురించి ధ్రువీకరించారట.


అయితే.. ఆయన ఎవరన్నది మాత్రం వెల్లడించడం లేదు. అయితే ఈ వార్తలు యుద్ధ వ్యూహాల్లో భాగం కూడా కావచ్చని మరి కొందరు విశ్లేషిస్తున్నారు. ఇలా వదంతులు వ్యాప్తి చేసి ప్రత్యర్థులను గందరగోళంలో పడేయడం కూడా ఓ వ్యూహమే అన్న వాదన కూడా ఉంది.  ఏదేమైనా పుతిన్ ఆరోగ్యం మాత్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సంగతి వాస్త వమే అంటున్నారు. మరి ఏది నిజం అన్నది మాత్రం కాలమే తేల్చాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: