కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టు కోవాలనుకుంటుందన్న వాదనలు వినిపిస్తున్తనాయి. దాని కోసం కెసిఆర్ ఇప్పటికే పావులు కదుపుతూ కేకేని ఒక ఆయుధంలా వాడారని తెలుస్తోంది. ఏపీలో ఎలాగైతే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్లు భారతీయ జనతా పార్టీ ప్రపోజల్.. వైస్ ప్రెసిడెంట్ లకు ఎలా అయితే సంతకాలు పెట్టారో.. ఆ విధంగా కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు కెసిఆర్. అంటే అవి రెండు కూటములుగా మారిపోయినట్టు తెలుస్తుంది.

 
వైఎస్ఆర్సిపి భారతీయ జనతా పార్టీతో కలిసి ఏమీ పోటీ చేయలేదు కానీ టిఆర్ఎస్ అయితే కాంగ్రెస్తో కలిసి పోటీ చేయడానికి సిద్ధమైంది. కానీ దానికి రేవంత్ రెడ్డి అడ్డుపడుతూ వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని  దెబ్బ కొట్టడంలో విజయం సాధించారు పెద్దలు. మాణిక్యం ఠాకూర్, రేవంత్ రెడ్డి మాత్రమే  ఒంటరిగా పోటీ చేద్దామని అనుకుంటున్నారు. కానీ సీనియర్లు మాత్రం టిఆర్ఎస్ ఇచ్చే పాతిక సీట్లను తీసుకుని కాంగ్రెస్ పార్టీ బయట నుండి మద్దతిస్తే అప్పుడు కేసీఆర్ మాట వింటాడని అనుకుంటున్నారు.


కెసిఆర్ కి కావాల్సింది కూడా అదే. పాతిక సీట్లను తీసుకుంటే , మొన్న చివరిలో పోతున్నటువంటి ఓట్లను,  పోటా పోటీ వాతావరణం ఏర్పడితే బిజెపి ఐదు శాతం  ఆధిక్యంతో  నెగ్గేస్తుందని భయం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఈ ఐదు శాతాన్ని భర్తీ చేసుకోవచ్చనే ధైర్యం ఉంది. ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా జత కడతారు.. కానీ తెలంగాణలో మాత్రం దీనికి సీన్ విరుద్ధంగా కనిపిస్తుంది. అక్కడ  అధికారంలో ఉన్న బి ఆర్ ఎస్( యాంటీ బీజేపీ కూటమి )పార్టీతో కాంగ్రెస్ జట్టు కట్టి రావాలనుకున్న ప్రతిపక్ష పార్టీని తొక్కాలనుకుంటున్నారని తెలుస్తుంది. అందుకే కాంగ్రెస్‌తో కలిపి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు కేసీఆర్. మరి అందుకోసం, ఆ మార్గంలో ఆయన చేసే ప్రయత్నాలు విజయం సాధించాయా.. ఇది తెలంగాణలో తాజాగా ఏర్పడిన సందిగ్ధత.. ఇక నిజం నిలకడ మీదే  తేలాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: