
అది 7000 ప్లస్ స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంలో ఉంది అని, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అనేది భారతదేశంలోనే పెద్దదైన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని అంటూ ఆ మధ్యన అమరావతి హైదరాబాద్ కన్నా పెద్దదైన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా కొనసాగిందని, కానీ అక్కడ ప్రస్తుతం పనులేమీ జరగడం లేదు కాబట్టి ప్రస్తుతం హైదరాబాదే భారతదేశంలో పెద్దదైన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఆయన చెప్పుకొచ్చారు.
50 చెరువులను మేం దత్తత తీసుకుంటున్నామని, నేను గతంలో ఒక విషయం పై వ్యాఖ్య చేసిన సందర్భంలో దానిని మీడియా ఛానల్స్ భూతద్దంలో చూపించుకుంటూ వచ్చాయని, ఏదైనా మాట్లాడితే దానిని న్యూస్ చానల్స్ వేరే విధంగా ఎక్స్పోజ్ చేస్తున్నాయని, అందుకని నేను ఏమీ మాట్లాడడం లేదని ఆయన అన్నారు. గుంటూరు బాగానే ఉంది, వైజాగ్ బాగానే ఉంది, విజయవాడ బాగానే ఉంది ఇలా అన్ని బాగానే ఉన్నాయని చెప్తూనే నేను వాటి గురించి మాట్లాడడం లేదు అని అంటూ ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చారు ఆయన.
అసలు విషయం ఏంటంటే ఇదివరకు ఆయన సి.ఆర్.డి.ఏ క్యాపిటల్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ అనే అథారిటీ పెట్టుకొచ్చారు. వాస్తవంగా ఏంటంటే హైదరాబాద్ ఎక్స్టెన్షన్ హెచ్ఎండిఏ ఇక్కడ హైదరాబాద్ అంతా నిండిపోయింది బయట నింపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తేడా ఏంటంటే ఇక్కడ సిఆర్డిఏ పెట్టి మొత్తం తీసుకొచ్చి 29 గ్రామాల్లో డెవలప్ చేయాలనుకుంది నాటి ప్రభుత్వం.