కేంద్రంలోని ఏన్డీఏ ప్రభుత్వం ఈడీ, సీబీఐ దర్యాప్తులతో కావాలనే వేధిస్తున్నాయని ఆరోపణలు చేయడం అలవాటైపోయింది. అయితే ఈడీ, సీబీఐలు కావాలని ఎవరిపై దర్యాప్తు చేయవు. అవి స్వతంత్ర దర్యాప్తు సంస్థలు. అవినీతి ఆరోపణలపై కంప్లైంట్ ఇస్తే అక్కడ అనుమానం ఉన్న చోట అవి తనిఖీలు నిర్వహించి అక్రమ లావాదేవీలు జరిగినట్లు తెలిస్తే వాటిని సీజ్ చేస్తాయి. అయితే స్వతంత్ర దర్యాప్తు సంస్థలను జేబు సంస్థలుగా బీజేపీ వాడుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీ పై విరుచుకుపడుతున్నారు.


రాష్ట్ర దర్యాప్తు సంస్థ అయిన సీఐడీతో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీ పంపినట్లుగా అనుమానాలు వ్యక్తం చేసిన మనుషులపై కేసులు పెట్టింది బీఆర్ఎస్ సర్కారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ లో  ఉన్నప్పుడు ఆయన భూముల గురించి ఏనాడు సీఐడీ అధికారులతో వేధింపులకు పాల్పడని బీజేపీలో చేరగానే భూ కబ్జాలు అంటూ సర్వేలు చేసింది. ప్రస్తుతం పొంగులేటి విషయంలో కూడా భూ అక్రమాలకు పాల్పడ్డాడని ఆయన భూములపై సర్వే చేస్తున్నారు.


ఇన్ని రోజులు ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారు. కాబట్టి అప్పుడు ఆయన అవినీతి రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించలేదు.  ఆయన పార్టీ మారగానే ఆయన ఆస్తులపై, భూములపై సర్వేలు చేస్తున్నారు. ఇది పార్టీ మారినందుకు కక్ష సాధింపు చర్యలతో చేస్తున్న పని గానే అభివర్ణించడంలో తప్పేముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ అధికారులతో ఈడీ లాంటి సంస్థలతో మనీ లాండరింగ్ కేసులు పెడితే మాత్రం కేంద్రం కక్ష సాధిస్తుందని గగ్గోలు పెడుతున్నారు.


రాష్ట్రంలోని దేశంలోని దర్యాప్తు సంస్థలను ఎవరికీ వారు ఇష్టరీతన వాడుతున్నారు. కానీ మాపై దాడులు చేస్తున్నారు. మనీ లాండరింగ్ కేసులు పెడుతున్నారంటూ ప్రజల్లోకి వెళ్లి కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. ప్రజలు మాత్రం అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పనులను గమనిస్తూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: