ఏపీ లో సీఎం జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించడానికి.. రాజకీయంగా అణగదొక్కడానికి టీడీపీ, జనసేనతో పాటు సీపీఐ, సీపీఎం లు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఈ పార్టీలతో పాటు ఎల్లో మీడియా కూడా కీలకపాత్ర పోషిస్తోంది అనేది వాస్తవం. వీరంతా ఒకే వేదికపైకి రాలేదు కానీ అందరి ఎజెండా మాత్రం జగన్ ని గద్దె దించడం. అందుకే వైసీపీ ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపి వాటిని ప్రచారం చేయడం.


ఈ ప్రచారాలన్నింటిని జగన్ మోహన్ రెడ్డి తన సొంత పత్రిక బ్లూ మీడియాలో ఫ్యాక్ట్ చెక్ పేరుతో కథనాలు ప్రచురిస్తున్నా ఇది అందరికీ చేరుతుందా లేదా అనేది అనుమానం. ఒక విషయాన్ని పదే పదే చెప్పడం వల్ల చూసే వారికి అయినా.. వినే వారికి అయినా నిజమోనేమో అందుకే ఇంతలా చెబుతున్నారు అనే ఆలోచన వస్తుంది. రోజూ అన్నం తినేవారికి ఇదేం బియ్యం అని ఎవరైనా అంటే తినేవారికి కూడా సందేహం వస్తుంది.


ఇప్పుడు ఏపీలో కూడా ఇదే తంతు నడుస్తోంది. ప్రజల్లో వైసీపీపై విషం నింపాలి. అది ఎలాగైనా.. జగన్ సర్కారు ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలెవరూ వ్యతిరేకించడం లేదు. ఎందుకంటే నేరుగా లబ్ధి పొందుతున్నారు కాబట్టి.  కానీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుదంటూ ఎల్లో మీడియా పదే పదే చెబుతూ టీవీలో కథనాలు ప్రసారం చేస్తోంది.


కానీ జగన్ వీటిని లైట్ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. నాకు ఏ మీడియా లేదు. మీరే నా బలం అంటూ పలు సభల్లో వ్యాఖ్యానిస్తుంటారు. కాకపోతే సాక్షి ఎవరిది అనే ప్రశ్న జనాల్లో సహజంగానే వస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత సృష్టించడం సులభం. అనుకూలత  చాలా కష్టం. తెలంగాణను తీసుకుంటే పదేళ్లుగా సీఎం కేసీఆర్ పై వ్యతిరేక వార్తలు రాసిన వారు లేరు. అన్ని పేపర్లు బీఆర్ఎస్ భజన చేశాయి. ఇప్పుడు ఫలితాలు చూస్తే కారు బోల్తా పడింది. కాబట్టి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైతే మౌత్ పబ్లిసిటీ ద్వారా జనాల్లోకి వెళ్లిపోతుంది. ఇప్పటికి అయినా జగన్ వాటిని ఎలా తిప్పికొట్టాలో తెలుసుకోకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: