
సమావేశంలో ఎస్టీ ఎమ్మెల్యేలు కొత్త ఐటీడీఏల ఏర్పాటు అవసరాన్ని ప్రస్తావించారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి ఐటీడీఏలు కీలకమని, వీటిని విస్తరించాలని వారు కోరారు. అటవీశాఖ నిర్ణయాలు ఆదివాసీల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయని వారు ఆరోపించారు. ప్రత్యేకించి, తడోబా-కవ్వాల్ టైగర్ రిజర్వ్‌ను కన్జర్వేషన్ రిజర్వ్‌గా ప్రకటించడంపై సీతక్క తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం స్థానిక ఆదివాసీల జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రామసభ అనుమతి లేకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో భూములు స్వాధీనం చేయడం సరికాదని ఎమ్మెల్యేలు నొక్కిచెప్పారు. ఆదివాసీల హక్కులను కాపాడేందుకు చట్టాలను కఠినంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ జీవో వల్ల ఆదివాసీలకు జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వం గుర్తించాలని వారు కోరారు. సీతక్క ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని త్వరలో కలవాలని నిర్ణయించారు. ఆదివాసీ సమస్యలను సీఎంతో చర్చించి, జీవో రద్దుకు చర్యలు తీసుకోవాలని ఆమె భావిస్తున్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు