
కిరణ్ కుమార్ థియేటర్లలో మొబైల్ ఫోన్‌తో సినిమాలను రహస్యంగా రికార్డ్ చేసి, మూవీరూల్జ్, 1తమిళ్‌ఎంవీ లాంటి పైరసీ సైట్లకు అమ్మినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల విడుదలైన ‘హ్యాష్‌ట్యాగ్ సింగిల్’ సినిమాను కూడా రిలీజ్ అయిన రోజే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చాడు. ఈ ఘటనపై టీఎఫ్‌సీసీ యాంటీ-పైరసీ సెల్ ప్రతినిధి యర్ర మణీంద్ర బాబు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. కిరణ్‌కు క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లింపులు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
కిరణ్ కుమార్ తన ఫోన్‌ను షర్టు జేబులో దాచి, ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసి థియేటర్లలో సినిమాలను రికార్డ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ రికార్డింగ్‌లను టెలిగ్రామ్ ద్వారా పైరసీ గ్రూపులకు పంపేవాడు. చెల్లింపులను బిట్‌కాయిన్‌లో తీసుకొని, జెబ్‌పే, కాయిన్ డీసీఎక్స్ లాంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రూపాయిల్లోకి మార్చుకునేవాడు. ‘పెళ్లికి ప్రసాద్’, ‘14 డేస్ లవ్’, ‘థండేల్’, ‘గేమ్ ఆన్’, ‘కిస్మత్’ లాంటి సినిమాలు ఇతడు పైరసీ చేసినవాటిలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు