హైకోర్టులో ఈ నెల 24న జరగబోయే విచారణకు ముందే మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు కంకణం కట్టుకున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ నెల 24 లేదా 25లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి సన్నాహాలు పూర్తి చేసింది.మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించి డిసెంబరు 16లోపు పూర్తి చేయాలని ప్రణాళిక రచిస్తున్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం మొదటి విడత పోలింగ్ డిసెంబరు మొదటి వారంలో జరిగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో భద్రత, ఏర్పాట్లు చేపట్టేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది.
పంచాయతీ ఎన్నికలు డిసెంబరులోనే జరపాలన్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. బీసీ రిజర్వేషన్లు యాభై శాతం దాటకుండా ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని గతంలో సీఎం రేవంత్ హామీ ఇచ్చినా హైకోర్టు బ్రేక్ వేయడంతో అది అమలు కాలేదు. ఇప్పుడు తక్కువ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాల్సివస్తోంది. మరి బీసీలను రేవంత్ రెడ్డి ఎలా బుజ్జగిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ బలాన్ని పరీక్షించే మొదటి పెద్ద పరీక్షగా మారనున్నాయి.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి