ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక.. స్థానిక పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా కొత్త చట్టం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం కూడా ఇదే తరహాలో చట్టం తీసుకొచ్చింది. జగన్ బాటలోనే కర్ణాటక సీఎం యడ్యూరప్ప నడిచారు. కర్నాటకలో ప్రైవేటు సంస్థలలో ఎనభై శాతం స్థానిక రిజర్వేషన్ లు అమలు చేసే విషయంలో ఆయా కంపెనీలతో మాట్లాడుతున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జగదీష్ పెట్టర్ చెప్పారు.

 

 

కర్నాటకలో ఇప్పటికే ఈ చట్టం చేయడం జరిగిందని, అయితే ప్రైవేటు సంస్థలు మరికొంత సమయం కావాలని అడిగాయని, అందుకోసం ఆగామని ఆయన చెప్పారు. ప్రైవేటు కంపెనీలలో సి,డి గ్రూపు ఉద్యోగాలు పూర్తిగా వంద శాతం కన్నడ భాష మాట్లాడేవారికే ఇవ్వాలని కోరుతున్నామని జగదీశ్ షెట్టర్ చెప్పారు. కొద్ది రోజుల క్రితం కన్నడ సంస్థలు కొన్ని స్థానిక రిజర్వేషన్ ల అమలుపై ధర్నాలు నిర్వహించాయి. దాని ఫలితంగానే ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చూస్తున్నారు.

 

 

అయితే ఇది ఏపీ నుంచి కర్ణాటక కు వెళ్లే యువకులకు ఇబ్బంది కరంగా మారే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇవన్నీ సీ,డీ స్థాయి ఉద్యోగాలే కాబట్టి అంత ఇబ్బంది ఉండదనే వాదన కూడా ఉంది. చూడాలి ఆచరణలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో..

 

మరింత సమాచారం తెలుసుకోండి: