ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలను http://frirecruitment.icfre.gov.in, http://fri.icfre.gov.in వెబ్ సైట్స్ లో చూడవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసిన 107 పోస్టుల పూర్తి వివరాలు ఒకసారి చూస్తే... టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్ / ల్యాబ్ రీసెర్చ్) - 59, మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 40, టెక్నికల్ అసిస్టెంట్ (మెయింటనెన్స్)- 3, స్టెనో గ్రేడ్ 2 - 4 లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్- 1 లా ఉన్నాయి. ఇందుకు సంబంధించి జీతాల వివరాలు కూడా పోస్టులు బట్టి విరివిరిగా లభించనున్నాయి. ఎవరైతే ఉద్యోగాలకు అప్లై చేయాలనుకొన్నారో వారు విద్యార్హతలకు సంబంధించి సరైన వివరాలు పొందుపరిచి అప్లై చేసుకోవాలి.
ఈ ఉద్యోగాలకు విద్యార్హతలు పోస్ట్ కు సంబంధించి వేరువేరుగా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ ని పూర్తిగా అధ్యయనం చేయండి. ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిన వారు జనరల్, బిసి వారికి దరఖాస్తు ఫీజు రూ. 700 గా నిర్ణయించగా... మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ. 300 గా నిర్ణయించారు. కాబట్టి ఈ పోస్టులకు ఎవరైతే అర్హులో వారు వెంటనే అప్లై చేసుకుని ఉద్యోగాన్ని సంపాదించండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి