ఇకపోతే కొన్ని కొత్త చికిత్సలను చేర్చారు. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం హెల్త్ కార్డు కలిగిన వారందరూ కొత్తగా చేర్చిన క్యాన్సర్ చికిత్సలకు సంబంధించిన వైద్య సేవలను అందుబాటులో ఉన్న నెట్ వర్క్ ఆసుపత్రులలో పొందవచ్చని పేర్కొన్నారు. కాగా, ఈ పథకాలకు సంబందించిన మరిన్ని వివరాలను www.ysraarogyasri.ap.gov.in లో చూడవచ్చని తెలిపారు. ఇందుకోసం 18004251818 టోల్ ఫ్రీ నెంబర్ కూడా పని చేస్తోందని.. ఈ నంబర్‌కు ఫోన్ చేసినా సమాచారం లభిస్తుందని తెలిపారు.
చికిత్స పొందాలనుకునే వాళ్లు ఏదైనా నెట్‌వర్క్ హాస్పిటల్ లోని ఆరోగ్య మిత్ర ద్వారా కూడా తెలుసుకోవచ్చని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి మల్లిఖార్జున పేర్కొన్నారు.అప్పులు చేసి వైద్యం చేయించుకుని.. ఆ నగదు రీయింబర్స్‌మెంట్ కోసం ఎమ్మెల్యేల చుట్టూ తిరిగే విధానం మారాలని, ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కోసం పంపే దరఖాస్తుల సంఖ్యను భారీగా తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఏపి లో నగదు రహిత వైద్యానికి కావలసిన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని సంభందిత అధికారులకు సూచించారు. అంతేకాదు ఈ పథకం విజయం కావాలంటే ఉద్యోగులు కావాలి.. అందుకే ఇప్పుడు అందులో ఖాళీలను పూర్తి చేసే ఆలోచనలో ఏపి సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా నిరుద్యోగ సమస్య తీరుతుంది. అలాగే ప్రజల అవసరం కూడా తీరుతుందని చెప్పుకొచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి