ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ముందస్తు పరీక్షలు ప్రిలిమ్స్ తొలగింపు పై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు చేస్తుంది. అభ్యర్థుల పై ఒత్తిడి తగ్గించి నియామకాలను త్వరితంగా చేపట్టాలన్న ఉద్దేశంbతో పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించడం పై కమిషన్‌ లో చర్చ జరుగుతోంది. ఏపీపీఎస్సీ గ్రూపు-1 ఉద్యోగాలను యథావిధిగా ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, మౌఖిక పరీక్షల ద్వారానే భర్తీ చేస్తారు. పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టినప్పుడు అభ్యర్థుల్లో పట్టుదల కనిపించడం లేదని, దరఖాస్తు చేసి పరీక్షలు రాయడం లేదని ఏపీపీఎస్సీ గుర్తించింది. 



గ్రూపు-2, 3, ఇతర ఉద్యోగాల నియామకాలకు 2016 నుంచి ఏపీపీఎస్సీ తొలుత ప్రిలిమ్స్‌ నిర్వహిస్తోంది. అయితే ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించిన తర్వాత మెయిన్స్ జరిపించడానికి దాదాపు రెండేళ్లు పడుతుందని అధికారులు తెలిపారు. ప్రిలిమ్స్‌ తీసేయడం వల్ల అభ్యర్థులకు సన్నద్ధతపరంగా సమయం కలిసొస్తుంది. సకాలం లో నియామకాలను పూర్తి చేసేందుకు వీలవుతుంది. అందుకే ప్రిలిమ్స్ పరీక్షలు తొలగింపు పై ఇప్పటికే పలు చర్చలు జరుగుతున్నాయి. కాగా, ఈ పరీక్షల్లో ప్రతిభా వంతులు మాత్రమే ఉత్తీర్ణత సాధించగా , మిగిలిన వాళ్ళు రాణించలేక పోతున్నారు. అందుకోసమే డైరెక్ట్ గా మెయిన్స్ నిర్వహించాలని భావించారు.



ఉన్నత విద్యాసంస్థల్లో జరిగే ప్రవేశాలకు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. 'నార్మలైజేషన్‌' ద్వారా ఉద్యోగాల సంఖ్యకు తగ్గట్టు అభ్యర్థులను ఎంపిక చేయవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే ప్రిలిమ్స్‌ను తొలగించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీల నుంచి విన్నపాలు వచ్చాయి. కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేయాల్సిన అంశం పై అధికారికంగా నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది' అని కమిషన్‌ వర్గాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఉద్యోగానికి సంబంధించిన పరీక్షలను 2, 3 రోజులపాటు నిర్వహించాల్సి వస్తే అభ్యర్థుల ప్రావీణ్యాన్ని గుర్తించడంలో అసమానతలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇక ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహిస్తుందో లేదో చూడాలి.. ఈ ఏడాది పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియాల్సి ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: