దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగుల కు అదిరిపోయే గుడ్ న్యూస్ ను అందించింది. బ్యాంకింగ్ లో ఉన్న పలు విభాగాల్లోని ఖాళీల ను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు సంబంధించినకొక నోటిఫికేషన్ ను విడుదల చేసారు. ఫైర్ ఇంజనీర్ ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతుంది. ఈ దరఖాస్తుల స్వీకరణ జులై 15 ను నుంచి ప్రారంభం అవుతుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఈ ఉద్యోగాల దరఖాస్తుల చివరి తేదీ జూన్ 28ని నిర్ణయించారు. అంటే ఇక పదిరోజులు మాత్రమే ఉంది. ఆసక్తి, అంతకన్నా ముందు అర్హత కలిగిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. https://www.sbi.co.in/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. గత ఏడాది ఈ ఉద్యోగాలకు డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 27  దరఖాస్తులను స్వీకరించి నిలిపివేసింది. ఇప్పుడు మళ్ళీ ఏవ్ ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతుంది. 

ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇవే..

దరఖాస్తులు కోరుతున్న మొత్తం ఖాళీలు - 16

ఫైర్ టెక్నాలజీ లేదా సేఫ్టీ ఇంజనీరింగ్ విభాగాల్లో ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు అర్హులు.. ఇకపోతే ప్రభుత్వ కాలేజీల్లో మాత్రమే డిగ్రీ పొంది ఉండాలి. మరో విషయమేంటంటే ఫైర్ బిఎస్సి చేసిన వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం వివరాలను నోటిఫికేషన్ లో  చూడవచ్చు.

అప్లికేషన్ ఫీ : జనరల్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సి మొదలగు వాళ్లకు ఫీజులో రాయితీ ఉంటుంది.

ముఖ్య గమనిక : గత ఏడాది డిసెంబర్ లో అప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు.. మరోసారి ఈ ఉద్యోగాల గురించి నోటిఫికేషన్ లో పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేసుకోగలరు..


మరింత సమాచారం తెలుసుకోండి: