సేంద్రీయ సేద్యం ఒక సవాల్

'జీవితం ఒక సవాల్, దానిని ఎలాగూ మనం స్వీకరిస్తున్నాం. వ్యవసా రంగంలో విజయం సాధించడం మరింత సవాల్. అందులోనూ సేంద్రయ సేద్యం చేయడం అతి పెద్ద సవాల్. దీనిని అందరూ స్వీకరించాలి. సంప్రదాయ సాగు పై  ప్రజలందరికీ అవగాహన పెంచాలి' అని జనసేన పార్టీ   అభ్యర్థిగా  విశాఖ పట్నం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చే సి  పరాజితులైన మాజీ ఐపిఎస్ అధికారి జెడి లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. యవతీ యువకులు, ముఖ్యంగా విద్యావంతులు సేంద్రీయ సాగుపై దృష్టి  పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. వ్యవసాయ రంగంలో చోటు చేసుకున్న ఆధునిక మార్పు రోగనిరోధక శక్తి పై  తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కరోనా మహమ్మారి మానవ సమాజం తీవ్ర ప్రభావాన్ని చూపిన విపత్కర పరిస్థితుల్లో  ప్రపంచం అంతా తమ మూలాలను వెతుక్కున్నదని ఆయన చెప్పారు. సంప్రదాయ వైద్యం, ఆహారపు అలవాట్లవైపు మానవ సమాజం మరలా దృష్టి సారించిందని  తెలిపారు.

విజయవాడలో జరుగుతున్న రైతు సదస్సు-21 లో లక్ష్మీనారాయణ రైతులతో సంభాషించారు. వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి ఒడిలో సహజ సిద్ధంగా పెరిగిన పంటల వల్ల ఆరోగ్యంగా ఉంటామని యువ రైతులకు తెలిపారు. గో ఆధారిత వ్యవసాయం ద్వారా అనారోగ్యాన్ని పారద్రోల వచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు. గ్రామాల్లోని యువకులు సంఘటితంగా సంప్రదాయ సాగుపై అవగాహన పెంచుకొని చుట్టుపక్కల వారిని కూడా ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా శిక్షణ ఇవ్వాలని లక్ష్మీ నారాయణ పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు సేంద్రీయ సేద్యాయనికి మరింత నిధులు అందించాలని అయన అభిప్రాయపడ్డారు. ఆంద్ర ప్రదేశ్ గో ఆధారిత వ్యవసాయ దారుల సంఘం కార్యదర్శి భరత్ తన ప్రసంగంలో రైతులకు ఎదురవుతున్న సాధక బాధలను ఏకరవు పెట్టారు. వ్యవసాయాన్ని వ్యాపారంగా చూడకుండా, అద్భతాలు అందించే జీవన వికాసంగా చూడాలని పిలుపునిచ్చారు. వివిధ ప్రాంతాల రైతులు తాము పండించిన సంప్రదాయ విత్తనాలను సదస్సుకు తీసుకువచ్చి సాటి రైతులకు ఉచితంగా ఉందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: