వెన్నునొప్పి అనేది ఎన్నో రకాల కారణాల వల్ల సంభవిస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో యువకులకు శారీరక శ్రమ అనేది కూడా చాలా తక్కువగా ఉంది. దీని కారణంగా వారి శరీరంలో రక్త ప్రసరణ బాగా మందగిస్తుంది. కొంతమంది ఇప్పటికీ ఇంటి నుండి పని చేస్తూ రోజంతా కూడా ఇంట్లోనే కూర్చుంటారు. కొంతమంది యువకులు కుర్చీపై సరైన స్థితిలో కూర్చుని చదువుకోవడం లేదా ల్యాప్‌టాప్ అస్సలు ఉపయోగించడం లేదు. పడుకుని పని చేయడం, పుస్తకం వంగి చదవడం ఇంకా అలాగే పడుకుని టీవీ చూడటం వంటివి కూడా వెన్నునొప్పికి కారణం కావచ్చు. ఇక చలికాలంలో కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా వెన్నునొప్పి సమస్యలను చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా వింటర్‌లో అల్లం టీ వెన్నునొప్పి బాధితులకు మంచి డ్రింక్‌ అనే చెప్పాలి. దీనిని ఎక్కువగా తాగడం వల్ల వెన్నునొప్పితో పాటు జలుబు, దగ్గు, జలుబు కూడా చాలా ఈజీగా నయమవుతాయి.వెన్నునొప్పి నుండి విముక్తి పొందడానికి మీరు పసుపు పాలను  తాగండి. ఇవి తాగితే వెన్నునొప్పి క్రమంగా తగ్గుతుంది.


పైగా ఇందులోని పోషకాలు కండరాలను చాలా బాగా బలపరుస్తాయి. ఇంకా అలాగే పసుపు పాలు  రోగనిరోధక శక్తిని పెంచడానికి మంచి మార్గం. వెన్నునొప్పి తగ్గడానికి మీరు యోగాసనాలు ఇంకా అలాగే కొన్ని వ్యాయామాలను కూడా ట్రై చెయ్యొచ్చు, అయితే, ఫిట్‌నెస్ నిపుణుడిని సంప్రదించకుండా మాత్రం వీటిని అస్సలు ట్రై చేయకండి. అలాగే మన వెన్నెముకపై ఒత్తిడిని తగ్గించడానికి మనం చేస్తున్న పని నుంచి అప్పుడప్పుడు కొద్ది పాటి విరామం తీసుకోవాలి. ఎక్కువ సేపు ఒకే భంగిమలో ఒకే చోట అస్సలు కూర్చోకూడదు. కనీసం రెండు గంటలకొకసారైనా కొంచెం సేపు లేచి అటూ ఇటూ తిరగాలి. లేకపోతే వెన్నునొప్పి తీవ్రమవుతుంది. ఎక్కువ గంటలు ఒకే భంగిమలో కూర్చోవడం మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి వీలయినంత వరకు వెన్నునొప్పిని తగ్గించుకోవడానికి ఖాళీ సమయంలో మెడ, వీపు ఇంకా అలాగే భుజాలకు సంబంధించిన వ్యాయామాలు చేయడం మీరు ఖచ్చితంగా అలవాటు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: