వారంతా ఎండకన్నెరగని కోటీశ్వరులు. ఏపీలో పుట్టారు. ఏసీలో పెరిగారు. ఇప్పడు కూడా ఏసీల్లోనే జీవిస్తున్నారు. కాలు బయట పెట్టగానే కార్లు.. అవి కూడా లగ్జరీ కార్లు. ఎక్కడికి వెళ్లాలన్నా.. విమానాలు, తీసుకునే ఆహారం ఎంత తక్కువ లెక్కలేసుకున్నా రోజుకి రూ.5వేల తక్కువ ఖర్చు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇది ఎండాకాలం. ఆపై ఎన్నికల కాలం.


మండుటెండలు సామాన్య మానవులకే మచ్చెమటలు పట్టిస్తున్నాయి. మరి ఎండ పరిస్థితి ఎరుగని వీరి పరిస్థితి ఏంటి. ఇంతకీ ఎవరి గురించి ఇదంతా అనుకుంటున్నారా.. అదే మన ఏపీ రాజకీయ నాయకుల గురించి. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల విషయాన్ని తీసుకుంటే ఏపీలో కోటీశ్వరులు చాలామందే బరిలో ఉన్నారు. కోట్లకు పడగలెత్తారు. అసలు వారు రోడ్డు మీద నడవాల్సిన పరిస్థితే లేదు. కానీ ప్రజల కోసం.. ఓట్ల కోసం సభల్లో అడుగేసేందుకు వారు రోడ్డెక్కుతున్నారు. ఇంటింటికీ తిరుగుతున్నారు.


వీరిలో అత్యధిక ధనవంతులు పెమ్మసాని చంద్రశేఖర్. ఈయన ఆస్తి రూ.5వేల కోట్లకు పైమాటే. ఆయన కాలు కదిపితే రోల్స్ రాయల్స్ వాలిపోతుంది. కానీ ఇప్పుడు పాదయాత్రగా ఇంటింటికీ నడవాల్సిన పరిస్థితి. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిళ. పుట్టుకతోనే కోటీశ్వరురాలు. ప్రస్తుతం ఈమె చూపిన ఆస్తి రూ.200 కోట్లు. అయినా ఆమె కాలు బయట పెట్టాల్సిన పనిలేదు. విలాసవంత జీవితం. కానీ రోడ్డెక్కారు.  


ఇక నెల్లూరు నుంచి బరిలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అత్యంత మోస్ట్ రాయల్ జీవితం గడుపుతున్నారు. ఇక భార్యాభర్తలకు 12 అత్యంత అధునాతన కార్లు కూడా ఉన్నాయి. కాలు తీస్తే కారు.. అన్నట్టు అయితేనేం ఇప్పుడు మంటు టెండలో మాడిపోతూ ప్రచారం చేస్తున్నారు. వీరే కాదు ఇంకా చాలా మంది నాయకుల పరిస్థితి ఇదే. రోడ్డెక్కి దండాలు పెడుతున్నారు. ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఉక్కపోతలు, ఎండ వేడిమిని తట్టుకోలేక మే 13 ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: