పుష్ప సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన ఐకాన్ స్టార్.. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.తెలుగు హీరోలెవరికీ జాతీయ నటుడు అవార్డు రాలేదు. అలాంటిది జాతీయ అవార్డు అందుకున్న తెలుగు తొలి హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. తన కెరీర్ లో అన్ని సినిమాల కోసం పడ్డ కష్టం ఒక ఎత్తు అయితే.. పుష్ప సినిమా కోసం పడ్డ కష్టం మరొక ఎత్తు.పుష్ప  సినిమా వచ్చి చాలా కాలం అయిన ఆ సినిమా మేనియా కొనసాగుతుంది.. ఈ సినిమా దెబ్బతో బన్నీ రేంజ్ పూర్తిగా మారిపోయింది.. దీంతో సీక్వెల్ విషయంలో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ పెంచేశాడని వార్తలు వినిపిస్తున్నాయి.పుష్ప 2 నుంచి ఇటీవల విడుదలైన టీజర్ అంచనాలను పెంచేస్తుంది.దీంతో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ కూడా పెంచేశాడట. తొలి పార్ట్ కోసం రూ.100 కోట్ల వరకు తీసుకున్నాడని, ఇప్పుడు సీక్వెల్ కోసం ఏకంగా రూ.150 కోట్లు తీసుకోబోతున్నాడని టాక్.

'పుష్ప' రాకముందు వరకు అల్లు అర్జున్ గురించి తెలుగు, మలయాళ ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. ఎప్పుడైతే ఈ సినిమా రిలీజైందే మొత్తం సీన్ మారిపోయింది. దేశంలో ఎక్కడికెళ్లినా సరే 'తగ్గేదే లే' అనే మ్యానరిజమ్ కామన్ అయిపోయింది. విదేశాల్లోనూ బన్నీ క్రేజ్ ఏ‍ర్పడింది. ఈ క్రమంలోనే 'పుష్ప 2'ని భారీ బడ్జెట్‌ పెట్టి మరీ తీస్తున్నారు. టీజర్ వల్ల హైప్ కూడా బాగానే పెరుగుతోంది.పుష్ప-2' చిత్రం స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్‌ 15 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.


అయితే ఇంత ఘనత సాధించిన అల్లు అర్జున్ ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసారు.శ్రీకాంత్, వేణు కలిసి నటించిన పెళ్ళాం ఊరెళితే సినిమాకి అల్లు అర్జున్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. కొన్ని రోజుల పాటు ఎస్వీ కృష్ణారెడ్డి దగ్గర పని చేశారు. ఈ విషయాన్ని ఎస్వీ కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పెళ్ళాం ఊరెళితే సినిమాకి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించారు.అయితే పని చేసిన సమయంలో అల్లు అర్జున్ ఎస్వీ కృష్ణారెడ్డికి భయపడేవారట. ఇండస్ట్రీలో నేను ఎవరికీ భయపడలేదు కానీ మీరంటే మాత్రం భయపడేవాడ్ని అంటూ తనతో అల్లు అర్జున్ అనేవారని గుర్తు చేసుకున్నారు. అల్లు అర్జున్ 1985లో వచ్చిన విజేత సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ తర్వాత స్వాతిముత్యం సినిమాలో నటించారు. డాడీ సినిమాలో అతిథి పాత్రలో మెరిసిన అల్లు అర్జున్.. గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: