రాత్రి పడుకునే ముందు పాదాలకు ఆయుర్వేద తైలం తో మసాజ్ చేయడం వల్ల నిద్ర సుఖం గా వస్తుంది. అలాగే రక్తప్రవాహాన్ని పెంచుతుంది. రోగనిరోధక శక్తిని ప్రేరేపించి, ఆటోఇమ్యూన్ వ్యాధులను నివారిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కోపం, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. వినికిడి సామర్థ్యం మెరుగుపడుతుంది. పాదాలపై దద్దుర్లు రాకుండా నివారిస్తుంది. అలాగే చర్మం పొడిబారకుండా ఉండేలా చేస్తుంది. పాదాల ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ఈ చికిత్స ఎంతగానో సహాయపడుతుంది.