ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. బీట్రూట్ కూరలు వాడుకోడానికే కాదు. ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరం. ఇక బీట్రూట్ వలన ఎన్ని ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయో చూడండి...డయాబెటిక్ రోగులు బీట్‌రూట్ తీసుకుంటే లివర్‌ సంబంధ సమస్యలు తలెత్తవు.బీట్‌రూట్ కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది.బీట్‌రూట్‌లో నైట్రేట్లతోపాటు ఖనిజాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలూ పుష్కలంగా ఉంటాయి.కాల్షియాన్ని వినియోగించుకోవడానికి తోడ్పడే సైలీషియా సైతం బీట్‌రూట్‌లో ఉంటుంది.బీట్‌రూట్‌కు ఎరుపు రంగుని కలిగించే బీటా సైయానిన్‌కు పేద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంది.


చర్మ సౌందర్యానికి అవసరమైన విటమిన్‌-బి సైతం బీట్‌రూట్‌‌లో ఉంది. బీట్‌రూట్‌కు ఎరుపు రంగుని కలిగించే బీటా సైయానిన్‌కు పేద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంది.చర్మ సౌందర్యానికి అవసరమైన విటమిన్‌-బి సైతం బీట్‌రూట్‌‌లో ఉంది.బీట్‌రూట్ తీసుకుంటే చర్మం, గోళ్లు, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండేదుకు ఉపయోగపడుతుంది.క్రీడాకారులు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగి పరిగెత్తినపుడు తక్కువ ఆక్సిజన్‌ తీసుకుంటారు. అందువల్ల త్వరగా అలసిపోరు. బీట్‌రూట్ పెదాలు పొడిబారకుండా కాపాడుతుంది.బీట్‌రూట్‌లోని బీటేన్‌ రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడుతుంది.రక్తనాళాలు, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్ తోడ్పడుతుంది.


గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది.బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్లు రక్తంలో కలిసిన తర్వాత నైట్రిక్‌ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల రక్తనాళాలు విప్పారి రక్తపోటు తగ్గేందుకు సహకరిస్తుంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బీట్‌రూట్ మలబద్దకాన్ని నివారిస్తుంది. బీట్‌రూట్‌లోని బోరాన్ లైంగిక హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ రక్తపోటును నియంత్రిస్తుంది. ‘అనీమియా’తో బాధపడేవారు రోజూ ఒక కప్పు బీట్‌రూట్‌ రసం తాగితే త్వరగా సమస్య నుంచి బయటపడతారు.రెండు రోజులపాటు రోజుకి 400 ఎంఎల్ చొప్పున బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగిన వృద్ధుల్లో మెదడు భాగంలో రక్త ప్రసరణ వేగం పెరిగి ఆలోచనల్లో చురుకుదనం కనిపించినట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇలాంటి మరెన్నో ఆరోగ్యవంతమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..

మరింత సమాచారం తెలుసుకోండి: