అయితే ఈ థైరాయిడ్ ను మంచి డైట్ ఫాలో అవుతూ కూడా తగ్గించుకోవచ్చు. ఇక అలాగే మనం తీసుకునే ఆహారంలో మెటబాలిజం రేటును పెంచి,థైరాయిడ్ సమస్యను అధిగమించవచ్చు. సాధారణంగా థైరాయిడ్ గ్రంధి టి3, టి4 హార్మోన్ల ను తగినంత మోతాదులో ఉత్పత్తి చేయకపోవడం వల్ల, దీని ప్రభావం శరీరంపై పడడం ప్రారంభమవుతుంది. దీనిని హైపోథైరాయిడిజం అంటారు. దీనివల్ల బరువు పెరగడం, చర్మం పొడిబారిపోవడం, జుట్టు రాలిపోవడం, గుండె పనితీరు తగ్గిపోవడం, శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోవడం వల్ల,ముఖంలో వాపులు,కండరాల నొప్పులు, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి.
అమెరికన్ హెల్త్ అసోసియేషన్ చేసిన ఒక పరిశోధనలో అయోడైజ్డ్ ఉప్పు వాడకం వల్ల థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. కానీ మన శరీరం సొంతంగా థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయలేదు. కాబట్టి అయోడైజ్డ్ ఉప్పు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. అలాగే గ్లాసు పాలు, అరకప్పు పెరుగు,అరకప్పు జున్ను, చేపలు తీసుకోవచ్చు. ఇక బ్రోకలీ,బచ్చలికూర, క్యాలీఫ్లవర్, లాంటి కూరగాయలు ఆకుకూరలు, గ్రీన్ టీ, బంగాళాదుంప ఇవన్నీ హైపోథైరాయిడ్ తో బాధపడుతున్న వారు తీసుకోకుండా ఉండటమే మంచిది.
ఇక శరీరంలో హార్మోన్లు ఎక్కువగా విడుదల అవడానిని హైపర్ థైరాయిడిజం అంటారు. ఇక ఈ సమస్య ఉన్నవారు కూరగాయలు,ముడి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే హార్మోన్ లను ఎక్కువగా విడుదల చేసే బ్రోకలీ, బచ్చలికూర, క్యాలీఫ్లవర్,ముల్లంగి, ఆకుకూరలు, పాలకూర, తులసి టీ, గ్రీన్ టీ వంటివి ఎంతో మేలు చేస్తాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి