రక్తం శుద్దిగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. రక్తం శుద్దిగా లేకపోతే కొన్ని రకాల వ్యాధులు శరీరం పై దాడి చేసి క్రుంగదీస్తాయి. కాబట్టి రక్తాన్ని శుద్దిగా ఉంచుకోవడానికి కావాల్సిన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. ఇక మన వంటింట్లో ఉండే ఈ పదార్థాలతోనే రక్తాన్ని శుద్దిగా వుంచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

రక్తాన్ని శుద్ధి చేసే ఆహారం

బీట్ రూట్ లను తాగటం లేదా తినడం వల్ల రక్తం శుద్దిగా ఉంటుంది. బీట్ రూట్ లో ఫైబర్ మరియు ఫోలేట్ ఉంటాయి. అంతే కాకుండా విటమిన్ బి9, పొటాషియం, మాంగనీస్ కూడా తగిన మోతాదులో ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేసేందుకు ఉపయోగపడతాయి. అంతే కాకుండా రక్త నాలాలు సంకోచించకుండా కూడా ఇవి ఉపయోగపడతాయి. నీళ్లు ఎక్కువగా తాగటం వల్ల రక్తం శుద్దిగా ఉంటుంది. మన శరీరంలో ఎన్నో రకాల విషతుల్యాలు ఉంటాయి. కాబట్టి రోజుకు 8 గ్లాసుల వరకు నీళ్లు తాగటం వల్ల శరీరం నుండి మాలినాలు భయటకు వెళతాయి. తులసి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తులసి ఆకుల్లో విటమిన్ కె, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి తులసి ఆకులు తీసుకోవడం వల్ల రక్త శుద్దికి మరియు ఎర్ర రక్త కణాల వృద్ధికి సహాయ పడుతుంది. ఇక భారతీయులు ఉపయోగించే పసుపు లో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. పసుపు లో ఉండే యాంటీ యాక్సిడెంట్ లు రక్త కణాలకు రక్షణ కల్పిస్తాయి. అంతే కాకుండా ఇందులో ఉండే కుక్కుమీన్ శరీరం లోని కణాలు దెబ్బ తినకుండా సహాయపడుతుంది. కాబట్టి రోజూ తినే ఆహారంలో పసుపు ఉండేలా చూసుకోవాలి. వారంలో ఒక్కసారైనా ఆకు కూరలు తినాలి. అంతే కాకుండా క్యాబేజీ, కాలిఫ్లవర్ లను కూడా తినడం మంచింది. ఇవి రక్తాన్ని శుద్దిచేయడానికి సహాయపడతాయి. నిమ్మరసం తాగటం వల్ల కాలేయం లోని టాక్సిన్ లను తొలగించవచ్చు. రక్తాన్ని శుద్ధి చేసేది కాలేయం కాబట్టి నిమ్మ రసం తాగటం వల్ల కాలేయం ఆరోగ్యంగా పనిచేస్తుంది. దాంతో రక్తం శుద్ధి అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: