ఉరుకుల పరుగుల జీవితం.. ఎవరికి కూడా ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం కాని ఆసక్తిగానే ఉండటం లేదు. డబ్బు సంపాదించాలనే ఆశ తో అందరూ డబ్బు వెంట పరుగులు పెడుతున్నారు. చివరికి అనారోగ్యం బారిన పడి ఆ డబ్బును మళ్ళి ఆరోగ్యం కోసమే ఖర్చు పెడుతున్నారు. అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజూ కాస్త వ్యాయామం చేయాలని.. మితమైన ఆహారం తీసుకోవాలి అని సూచిస్తూ ఉంటారు నిపుణులు. కానీ నేటి రోజులలో జనాలు అదేమీ పట్టించుకోవడం లేదు. దీంతో ఎంతో మంది స్థూలకాయులు గా మారిపోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.  భారీగా బరువు పెరిగిపోవటం.. బరువు తగ్గించుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు.


 అయితే ఒకసారి భారీగా పెరిగిన తర్వాత ఇక వ్యాయామశాల వెళ్లి చెమటోడ్చి కష్టపడితేనే బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ కొంతమంది సులువుగా బరువు తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలను వెతుకుతూ ఉంటారు. అయితే అలాంటి వారికి ఇక ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి. అమెరికాలో ఎక్కువమంది   ఊబకాయంతో బాధపడుతున్నట్లు ఇటీవలే నివేదికలో తేలింది. ఈ క్రమంలోనే ఇటీవల అమెరికాలో విగోవి అనే ఔషధాన్ని భారీగా డిమాండ్ ఏర్పడింది. ఊబకాయంతో బాధపడుతున్నవారికి అందరూ ఇక ఈ మందును కొనడానికి దుకాణాలకు బారులు తీరుతున్నారు. అయితే అమెరికాలో ఉన్న వయోజనుల్లో ఎక్కువమంది స్థూలకాయులే ఉన్నారట. ఈ క్రమంలోనే ఈ ఇంజక్షన్ కు గిరాకీ పెరిగిందని తెలుస్తోంది.


 ఇంతకీ ఇంజక్షన్ స్పెషాలిటీ ఏంటి అని అనుకుంటున్నారు కదా.. ఈ ఇంజక్షన్ తీసుకున్నారు అంటే చాలు ఏకంగా 15 శాతం వరకు బరువు తగ్గే అవకాశం ఉందట. డెన్మార్క్కు చెందిన నోవో నార్దిస్క్ అనే కంపెనీ ఇక ఈ ఇంజెక్షన్లు తయారుచేసింది. దీనికి అమెరికా ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు లభించాయి. దీంతో ఇక అమెరికాలో ఇంజక్షన్ కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది.  వారానికి నాలుగుసార్లు ఔషధాన్ని తీసుకుంటే ఆకలిని నియంత్రించి బరువు తగ్గేందుకు దోహదపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: