దేశంలో ఒకపక్క కరోనా తగ్గుముఖం పట్టింది అనుకుంటున్న వేల వానలు వరదలు వచ్చి నిద్ర లేకుండా చేశాయి. దీనితో తయారైన దోమలు ఇప్పుడు జికా రూపంలో ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. మందు లేని వ్యాధులకు ముందస్తు జాగర్తలు అత్యవసరం. అది భారీ వర్షాల వలన కాస్త లోపించినట్టే ఉంది. అందుకే దేశంలో పలుచోట్ల ఈ జికా వైరస్ విజృంభిస్తుంది. తాజాగా కాన్పూర్ లో కూడా గత 24 గంటలలో 13 జికా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ముగ్గురు మహిళలు, 6 చిన్నారులు ఉన్నారు. దీనితో మొత్తం బాధితుల సంఖ్య 108 కి చేరింది. కేసులు పెరిగిపోతుండటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యాధి వ్యాపించకుండా నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో లార్వాలను నాశనం చేసే రసాయనాలను చల్లుతున్నారు. కాన్పూర్ మునిసిపల్ కార్పొరేషన్ లో జికా కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుండే ఆయా ప్రాంతాలలో నమోదవుతున్న కేసులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కాన్పూర్ లో ఈ స్థితి మరింత ఘోరంగా తయారయ్యే అవకాశం ఉన్నందున ఈ తరహా ఏర్పాట్లు చేశారు. బాధితులకు కౌన్సెలింగ్ కూడా అవసరం అని అధికారులు భావిస్తున్నారు, సమయానుకూలంగా ఆయా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

వైరస్ సోకినా వారికి నిరంతరం పరిశీలిస్తున్నారు. సాధారణ జ్వరం వచ్చిన వారు కూడా ఆందోళనతో జికా వచ్చినట్టు భయబ్రాంతులకు గురికావడం జరుగుతుందని, అందుకే వారికి తగిన కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నట్టు వైద్య అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కాన్పూర్ లో జికా పరీక్షలు ముమ్మరం చేశారు. దాదాపు 12 ప్రాంతాలలో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో 13 కేసులు కొత్తగా బయటపడ్డాయి. అందుకే ఆయా ప్రాంతాలలో లార్వాల నివారణకు 100 బృందాలు స్ప్రే కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. దాదాపు ఆయా ప్రాంతాలకు 6 కిమీ మేర ఈ కార్యక్రమం జరుగుతుంది. అధికారులు ఆయా కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కేసులు మళ్ళీ పెరగకుండా ఈ తరహా చర్యలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: