ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం దినదిన గండంగా మారుతోంది. పరుగులు తీస్తున్న కాలంతో పాటు మన జీవన శైలి కూడా ఎంతగానో మార్పు చెందింది. బయట ఆహరం ఎక్కువగా తీసుకుంటున్నాం. వాస్తవానికి బయట తినాల్సిన పరిస్థితులు వస్తున్నాయనే చెప్పాలి. కానీ వీలైనంత వరకు మనం ఇంటి భోజనానికి ప్రాముఖ్యతను ఇవ్వాలి. అందులోనూ పోషకాహారాన్ని తీసుకోవడం మంచిది. కాగా దుంపలు అనేవి మన ఆరోగ్యానికి ఎంత మంచివో తెలిసిందే. భూమి లోపల పండే దుంపలు తింటే ఆరోగ్యానికి చాలా శ్రేష్ఠమని వైద్య నిపుణులు చెబుతుంటారు. అందులో భూమిలో పండే క్యారెట్ అయితే మనిషి ఆరోగ్యానికి బంగారు కవచం లాంటిది. ఇది మన శరీరానికి చాలా మేలు చేస్తుంది.

క్యారెట్ లో ఉండే పోషకాలు మన ఆరోగ్యాన్ని మరింత పటిష్టం చేస్తాయి.  ముఖ్యంగా శీతాకాలంలో దొరికే క్యారెట్ లో పోషకాలతో పాటుగా రుచి కూడా అధికంగా ఉంటాయి. అవును చలికాలంలో దొరికే క్యారెట్ లు బలే రుచిగా ఉంటాయి. ఇక క్యారెట్ అనేది ఏ సీజన్ లో అయినా మనకు అందుబాటులో ఉండే ఒక కూరగాయ. ఇది మన శరీరానికి ఎన్ని విధాలుగా మంచి చేస్తుంది అనేది ఇపుడు ఒకసారి తెలుసుకుందాం.

* క్యారెట్ లో ఉండే పీచు పదార్థం వలన జీర్ణ క్రియ మెరుగ్గా పనిచేస్తుంది.
* క్యారెట్‌లో అధిక మొత్తంలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది మన శరీరంలోని విటమిన్ ఎ ఎక్కువగా పెంపొందెలా చేసి కళ్ళను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అందుకే మనం నిత్యం క్యారెట్ ను తినాలి అంటారు పెద్దలు.
*  గుండె కు కూడా క్యారెట్ లోని పోషకాలు కవచంలా పనిచేస్తాయట. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు తరచూ వారి ఆహారంలో క్యారెట్ తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.
*అంతేకాకుండా మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణలో కూడా క్యారెట్ లోని పోషకాలు ముఖ్య పాత్ర పోషిస్తాయట. రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా క్యారెట్ లు చాలా చక్కగా ఉపయోగపడతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు నుండే క్యారట్  ను  తినడం అలవర్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: