కొత్త సంవత్సరం మొదలైన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు గానే స్థూలకాయంతో బాధపడే వారు కూడా అధిక బరువును తగ్గించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఒమిక్రాన్ వ్యాప్తి చాపకింద నీరులా వ్యాపిస్తోంది కాబట్టి ఈ నేపథ్యంలో జిమ్ సెంటర్లు అన్నీ కూడా క్లోజ్ అవుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే బరువు తగ్గడం అనేది కొంతమందికి అతి పెద్ద సవాల్ గా మారుతోంది. ఇలాంటి లాక్ డౌన్ సమయంలో మనం ఇంట్లోనే ఉంటే కచ్చితంగా మరింత బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో కూడా కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం వల్ల ఇలాంటి సమయంలో కూడా మీరు ఎటువంటి ఖర్చు లేకుండా త్వరగా బరువును తగ్గించుకోవచ్చు.


చాక్లెట్స్:
చాక్లెట్స్ అధికంగా తినడం వల్ల ఇందులో ఉండే నూనెలు, రిఫైండ్ పిండి, చక్కెర అన్నీ కూడా బరువును పెంచడానికి దోహదపడతాయి. ఇందులో పోషక విలువలు కూడా తక్కువగా ఉండటం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాక్లెట్లు , క్యాండీలు పూర్తిగా మానేస్తే కొంత వరకు మీరు బరువు తగ్గించడంలో మొదటి ప్రయత్నం చేసిన వాళ్లు అవుతారు.

తీపి పానీయాలు:
తీపి పానీయాలలో ఎక్కువ కేలరీలు ఉన్నప్పటికీ వాటి ద్రవ  స్థితి కారణంగా ఘన ఆహారాలుగా మెదడు వాటిని  పరిగణించదు.. పైగా ఎన్ని క్యాలరీలు తీసుకున్నా కడుపు నిండింది అనే భావన మెదడు సంకేతాలను పంపించింది . కాబట్టి ఎక్కువ తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది.. కాబట్టి వీలైనంత వరకు తీపి పానీయాలకు దూరంగా ఉండండి.


పిజ్జా:
పిజ్జా లో రిఫైన్డ్ పిండి తో పాటు ప్రాసెస్ చేసిన మాంసాహారం అధిక మొత్తంలో ఉండడం వల్ల ఎక్కువ కేలరీలు స్థూలకాయానికి దారితీస్తాయి. కాబట్టి వీటికి ప్రత్యామ్నాయంగా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.

వీటితో పాటు ఐస్ క్రీమ్,  ప్రాసెస్డ్ ఫుడ్ లాంటి వాటికి కూడా దూరంగా ఉండడం వల్ల అధిక బరువు ( స్థూల కాయంను ) ను దూరం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: