ఇటీవల కాలంలో చిన్న వయస్సులోనే చాలా మంది ఎక్కువగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటి అధిక బరువు. కాగా అధిక బరువు వలన చిన్న వయస్సులోనే గుండె జబ్బులు, డయాబెటిస్, హార్ట్  స్ట్రోక్, అలాగే కొన్ని రకాల క్యాన్సర్‌లకు గురికావడానికి ప్రధాన కారణంగా చెప్పువచ్చు. మరి అలంటి పరిస్థితిలో, అధిక బరువును నియంత్రించడం చాలా ముఖ్యమైన విషయం. అలాంటి బరువును తగ్గించుకోవడం అనేది పెద్ద కష్టమైన పనిగా భావిస్తూ అంతగా పటించుకోరు. కానీ మనసుపెట్టి సరైన పద్ధతిలో కనుక ప్రయత్నం చేస్తే కచ్చితంగా  అధిక బరువు చాలా వేగంగా తగ్గించుకోవడం సాధ్యం అవుతుంది అంటున్నారు నిపుణులు... అంతేకాదు బరువు తగ్గడం కోసం వారు చెబుతున్న ఈ ఐదు మార్గాలు క్రమం తప్పకుండా అనుసరిస్తే కేవలం నెల రోజుల్లోనే మూడు కిలోల వరకు బరువు తగ్గొచ్చు అని కూడా చెబుతున్నారు.మరి బరువు తగ్గడానికి సహాయపడే వారు చెప్పే ఈ 5 మార్గాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1. ఉదయాన్నే అల్పాహారంలో అధిక ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్ల కన్నా ప్రోటీన్ జీర్ణం కావడానికి శరీరం ఎక్కువ కేలరీలు ఖర్చు చేయాల్సి ఉండటం వలన ఇది బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది.

2. అలాగే ఆహారంలో బరువును తగ్గించే ఆహారం అనగా  పప్పుధాన్యాలు, బీన్స్, అధిక ఫైబర్, అలాగే తక్కువ కేలరీలు ఆకు కూరలలో కనిపిస్తాయి. ఇది ప్రోటీన్ ఫైబర్ కు సంబంధించినటువంటి  మంచి వనరులు. అంతేకాదు బరువు తగ్గించడంలోను సహాయపడుతుంది.

3. మంచి నిద్ర .. తక్కువగా  నిద్ర పోవటం అనేది ఆకలిని తగ్గించే హార్మోన్‌ను తగ్గించి ఆకలిని ఇంకా పెంచుతుంది. కావున రోజుకి సగటున మనిషి 8 గంటల వరకు నిద్రపోవటం చాల మంచిది.

4. ఆహారాన్ని నెమ్మదిగా తినడం..ఆహారం జీర్ణమయ్యే హార్మోన్ గ్రెలిన్, ఇది ఆకలిని నియంత్రించే హార్మోన్ల నుండి సంకేతాలను మెదడుకు చేర్చడానికి 20 నిమిషాలు పడుతుందట. మరి అటువంటి పరిస్థితిలో, ఆహారాన్ని వేగంగా తినడం ద్వారా,ఆ  సిగ్నల్ మెదడుకు చేరుకునే లోపే ఎక్కువ కేలరీలను తీసుకుని బరువు తగ్గటం కష్టం అవుతుంది. అందువలన ఆహారాన్ని నెమ్మదిగా తీసుకోవటం కూడా ఒక భాగమే అంటున్నారు నిపుణులు.

5. అలాగే బరువు తగ్గాలి అనుకునే వారు చక్కెర పానీయాలు, అలాగే పండ్ల రసాలకు దూరంగా ఉండాలి. ఎందుకు అంటే చక్కెర,పండ్ల రసాలు బరువు నియంత్రణ వ్యవస్థను దెబ్బతీస్తాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: