కాల్షియం లోపం అనేది కొన్ని కోట్లాది మంది పిల్లల్లో కనిపించే కామన్ సమస్య. పిల్లల్లో కాల్షియం లోపం ఏర్పడటం వల్ల వారి ఎదుగుదల అనేది బాగా దెబ్బ తింటుంది. ఎముకల సాంద్రత కూడా తగ్గిపోతుంది.ఎప్పుడూ కూడా చాలా నీరసంగా కనిపిస్తుంటారు. అలాగే మరెన్నో సమస్యలు కూడా వారిలో తలెత్తుతాయి. అందుకే పిల్లల్లో ఏర్పడ్డ కాల్షియం లోపాన్ని పొరపాటున కూడా అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇక వెంటనే కాల్షియం కొరతను పూడ్చేందుకు ప్రయత్నించాలి. అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే ఆహార పదార్ధాలు చాలా అద్భుతంగా సహాయపడతాయి. మరి ఆ ఆహార పదార్ధాలు ఏంటో ఆలస్యం చేయకుండా మనం ఇప్పుడు తెలుసుకుందాం.బాదం పప్పు అనేది పిల్లల్లో కాల్షియం లోపానికి చెక్ పెట్టడానికి చాలా సూపర్ గా హెల్ప్ చేస్తుంది. బాదం పప్పులో కాల్షియంతో పాటు మరెన్నో ఆరోగ్యకరమైన పోషకాలు నిండి ఉంటాయి. వీటిని నీటిలో రాత్రంతా కూడా నానబెట్టి ఉదయాన్నే పిల్లల చేత తినిపించాలి. ఇలా రోజుకు నాలుగు బాదం పప్పులను పిల్లలకు తినిపిస్తే కాల్షియం లోపం నుంచి వారు వెంటనే బయట పడతారు.



ఎముకలు ఇంకా అలాగే కండరాలు దృఢంగా పెరుగుతాయి. బాదం పిల్లల మానసిక ఎదుగులను కూడా బాగా పెంచుతుంది.అలాగే నువ్వులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వివిధ రకాల జబ్బులను కూడా నివారించడంలో ఇవి గ్రేట్‌గా సహాయపడతాయి. కాల్షియం కొరతను పూడ్చే శక్తీ వీటికి బాగా ఉంది. పిల్లలకు నువ్వులను ఒక టేబుల్ స్పూన్ చొప్పున ప్రతి రోజు కూడా ఏదో ఒక రూపంలో ఇస్తే వారిలో కాల్షయం లోపం సమస్య అనేది క్రమంగా తగ్గిపోతుంది.అలాగే జున్ను కూడా చాలా మంచిది. అది ఎంత టేస్ట్‌గా ఉంటుందో అంతే ఎక్కువ పోషకాలను కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా జున్నులో కాల్షియం కంటెంట్ అనేది చాలా సమృద్ధింగా నిండి ఉంటుంది. అందువల్ల, పిల్లలకు వారంలో కనీసం రెండు సార్లు అయినా జున్నును కనుక పెడితే.. వారిలో కాల్షియం లోపం తగ్గి వారు యాక్టివ్‌గా ఇంకా అలాగే హెల్తీగా కూడా మారతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: