అధిక బరువు ఇంకా శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించుకోవటానికి మనలో చాలా మంది అనేక రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు.అయిన కూడా అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వక నిరాశకు గురి అవుతూ ఉంటారు. ప్రతి రోజు అరగంట వ్యాయామం లేదా యోగా చేస్తూ ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే కనుక అధిక బరువు సమస్య నుండి బయట పడవచ్చు.ఇక ఒక నిమ్మకాయ తీసుకొని శుభ్రంగా కడిగి సగానికి కట్ చేసి నిమ్మరసం ఒక బౌల్ లోకి పిండాలి. వాటిని నిమ్మతోక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. నిమ్మకాయ పొత్తికడుపు మరియు నడుము నుండి అదనపు కొవ్వును ఈజీగా కరిగిస్తుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక లీటర్ నీటిని పోసి కొంచెం వేడి అయ్యాక రెండు అంగుళాల దాల్చినచెక్క ముక్కను అందులో వేయాలి.ఇక దాల్చిన చెక్క పొడి అయితే ఒక స్పూన్ మోతాదులో వేయాలి.దాల్చిన చెక్క కొవ్వును కరిగించటంలో చాలా బాగా సహాయపడుతుంది. ఆ తర్వాత ఒక స్పూన్ మిరియాలను వేయాలి. పొడి రూపంలో వేస్తే అరస్పూన్ మిరియాల పొడి ఈజీగా సరిపోతుంది. ఈ మిరియాలలో ఉండే పైపెరిన్‌ శరీరంలో కొవ్వు కణాలు పేరుకుపోకుండా నిరోధిస్తుంది.అలాగే జీవక్రియలు బాగా సాగేలా చేస్తుంది.


ఇంకా గ్యాస్ట్రిక్ జ్యూస్‌ లు బాగా విడుదల అయ్యేలా చేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.ఇక ఆ తర్వాత అంగుళం అల్లం ముక్కను తురిమి వేయాలి. అల్లం జీవక్రియలను వేగవంతం చేసి వేగంగా బరువు తగ్గటానికి బాగా సహాయపడుతుంది. కడుపు నిండిన భావన కూడా ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. ఇక ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న నిమ్మ తొక్కలను వేయాలి. నిమ్మతొక్కలలో ఉండే పెక్టిన్‌ బరువు తగ్గటానికి బాగా సహాయపడుతుంది. ఒక 7 నుంచి 9 నిమిషాలు మరిగించి వడకట్టి దానిలో నిమ్మరసం కలపాలి.ఇక ఈ డ్రింక్ ఫ్రిజ్ లో పెడితే నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటుంది. ప్రతి రోజు ఉదయం పూట ఒక గ్లాస్ డ్రింక్ లో ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ డ్రింక్ శరీరాన్ని బాగా నిర్విషీకరణ చేస్తుంది. శరీరానికి మంచి శక్తిని ఇస్తుంది. అలాగే పొట్ట మరియు నడుము చుట్టూ ఉన్న అదనపు కొవ్వును కూడా తొలగిస్తుంది. కడుపు నిండిన భావనను కూడా కలిగిస్తుంది. ఇంకా అలాగే తినాలనే కోరికను తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: