బెల్లం లో విటమిన్ బి 1, బీ -6 , మెగ్నీషియం, కార్బోహైడ్రేట్, సోడియం వంటి అనేక పోషకాలు బెల్లం లో చాలానే ఉన్నాయి.. బెల్లపు నీరు ఏదో విధంగా మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇక ఎసిడిటీ సమస్య తో ఇబ్బంది పడుతున్న వారు బెల్లం నీటిని తాగితే వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. గ్యాస్ సమస్యలు కూడా దూరమవుతాయని చెప్పవచ్చు. ఈ రోజుల్లో చాలామంది మలబద్దక సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు.


అయితే ఎవరైతే మలబద్దక సమస్యతో ఇబ్బంది పడే  వారు నిద్ర లేచిన తర్వాత కార్యకర్తలను ముగించుకొని ఖాళీ కడుపుతో బెల్లం నీరుని తాగితే ఎలాంటి ఇబ్బంది లేకుండా సుఖ విరేచనం అవుతుంది. బెల్లం నీటితో కిడ్నీకి సంబంధించిన సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు ఇది శరీరానికి డిటాక్సీ వచ్చేలా చేస్తుంది గోరువెచ్చని నీటిలో బెల్లాన్ని కలిపి తీసుకుంటే శరీరంలో ఉండే మలినాలు కూడా సులభంగా తొలగిపోతాయట. బెల్లం శరీర బరువును అదుపులో ఉంచడమే కాకుండా ఊబకాయంతో బాధపడుతున్నవారికి మంచి దివ్యౌషధంలా పనిచేస్తుంది.


బెల్లం నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల కొద్ది రోజులలోనే బరువు తగ్గే అవకాశం ఉంటుంది. బెల్లం లో విటమిన్ సి ఉండడం వల్ల దీనిని వేడి నీళ్లలో కలుపుకుని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే ఒత్తిడికి గురి కాకుండా మన శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది. బెల్లం నీరు తాగడం వల్ల కాలేయం నుంచి విషపదార్థాలు సులువుగా బయటకు వెళ్లిపోతాయి. ఎందుచేత అంటే ఇందులో యాంటీఆక్సిడెంట్లు ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల సూక్ష్మ పోషకాలు ఎక్కువగానే విడుదలవుతాయి. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు ఈ బెల్లం నీటిని తాగుతూ ఉంటే చాలా మంచిది. శరీరంలో ఎర్రరక్తకణాలు ఏర్పడడానికి ఈ బెల్లపు నీరు చాలా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: