అన్ని పోషకాలు ఒకే పండుగ దొరుకుతాయి అంటే ఎవరు తినరు చెప్పండి. అదే డ్రాగన్ ఫ్రూట్.ఇది రుచి, రంగు,పోషక విలువల కారణంగా చాలా మంది ఈ పండు తినడానికి మక్కువ చూపుతారు. డ్రాగన్‌ ప్రూట్ లో మన శరీరానికి కావాల్సిన ఫైబర్‌, ప్రొటీన్లు పుష్కళంగా ఉన్నాయి. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. విటమిన్‌ సి, బి1, బి2, బి3 విటమిన్ల ఉంటాయి. రోజువారీ ఆహారంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ తీసుకుంటే .. అనేక ఆరోగ్యసమస్యలు దూరంగా ఉంచవచ్చని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.

 ఇందులో యాంటీఆక్సిడెంట్స్,ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్,‌ ఫైబర్ పుష్కళంగా లభిస్తాయి. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది.

1).గుండె ఆరోగ్యానికి ..
మనం తరచుగా డ్రాగన్‌ ఫ్రూట్‌ తింటే.. గుండెసమస్యలు రాకుండా కాపాడుతుంది. డ్రాగన్‌ ఫ్రూట్‌ గుండెను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. డ్రాగన్‌ ఫ్రూట్‌ విత్తనాలలో ఒమేగా -3, ఒమేగా -9 ఫ్యాటీ యాసిడ్స్‌, hdl అధికంగా ఉంటాయి. ఇవి మంచికోవ్వులను పెంచడంలో సహాయపడతాయి.ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

2).క్యాన్స్రర్‌ నివారించడానికి..
 డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటిట్యూమర్, యాంటీఆక్సిడెంట్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి రొమ్ముక్యాన్సర్‌ తో బాధపడే స్త్రీలకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

3). మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి..
డ్రాగన్ ఫ్రూట్ తరుచు తీసుకుంటూ ఉంటే కొలెస్ట్రాల్‌ ట్రైగ్లిజరైడ్, లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్ వంటి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, మంచి కొలెస్ట్రాలను పెంచుతాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ దీని గింజల్లో అధికంగా ఉండడం వల్ల గుండె సమస్యలు తగ్గుతాయి.

4).అర్థరైటిస్‌ తగ్గించడానికి..
ఆర్థరైటిస్ నొప్పి.. ఇన్ఫ్లమేషన్‌, ఆక్సీకరణ ఒత్తిడి వల్ల వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్ల వల్ల ఆర్థరైటిస్ నొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది .


5).మెదడుకు మంచిది..
ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా  అల్జీమర్స్, పార్కిన్సన్స్, మూర్ఛ వంటి ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. డ్రాగన్‌ ఫ్రూట్‌ తింటే మెదడు పనితీరు మెరుగుపడి ఈ సమస్యలను తగ్గిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: