
పసుపు పాలు..
పసుపు పాలను రోజుకొక గ్లాస్ తాగడం వల్ల పసుపులో ఉన్న ఆంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండడం వల్ల గొంతులో గరగరని ఈజీగా తగ్గిస్తుంది.ఇలా పసుపు పాలు తాగేటప్పుడు చక్కెర మరియు బెల్లంకి బదులు తేనె కలుపుకొని తాగడం ఉత్తమం.ఎందుకంటే చక్కెర మరియు బెల్లం ఇచ్చే స్వీట్ నెస్ కి గొంతు గరగర ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
దాల్చిన చెక్క పొడి..
వేడి నీటిలో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి,ఒక స్పూన్ నిమ్మరసం,ఒక స్పూన్ తేనె కలిపి ఉదయం లేవగానే తాగడం వల్ల గొంతు గరగరను తొందరగా పోగొట్టుకోవచ్చు.అంతేకాక ఈ నీటిని తరచూ తాగడం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది.
ఉప్పునీరు..
జలుబు చేసిన వెంటనే ఉప్పు నీళ్లతో రోజుకు రెండుసార్లు గార్గలింగ్ చేయడం వల్ల గొంతులో ఉన్న బ్యాక్టీరియా నశించి,గొంతు సమస్యలను తగ్గిస్తుంది.కావున గొంతు నొప్పిగా ఉన్నా,గరగరగా ఉన్నా వెంటనే ఉప్పు నీరు పుక్కలించడం చాలా మంచిది.
యూకలిప్టస్ ఆయిల్..
వేడి నీటిలో రెండు నుంచి మూడు చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పట్టుకోవడం వల్ల గొంతు గరగరను తొందరగా తగ్గించుకోవచ్చు.
జింక్ బిల్లలు..
జింకు అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా గొంతు గరగరను తగ్గించుకోవచ్చు.మనం తీసుకునే ఆహారంలో ఉన్న జింక్ కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో ఉత్తమంగా పనిచేస్తుంది.
కావున మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే వెంటనే ఈ చిట్కాలను పాటించి చూడండి.