
కోవిడ్ వైరస్ 2025 ఇప్పుడు ఎన్నో వేరియంట్లతో ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తుంది. ప్రస్తుతం జె ఎన్ వన్ వేరియంట్ చాలా చాలా తక్కువ వ్యాప్తిలో ఉంది . లో గ్లోబల్గా ఈ వేరియంట్ చివరి దశ అవుతుంది అంటూ గాంధీ ఆసుపత్రి క్రిటికల్ కేర్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ అభిప్రాయపడ్డారు . ఆయన మాట్లాడుతూ .."ఈ కరోనా ప్రపంచ వ్యాప్తంగా ఒకే వేరియెంట్ తీవ్ర స్థాయిలో వ్యాప్తిస్తూ కోట్లాదిమంది ఆరోగ్యాలపై ప్రభావం చూపిస్తుందన్నారు . అంతేకాదు ఆ తర్వాత వైరస్ ప్రభావం సగం వరకు తగ్గి తర్వాత కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం అవుతూ వస్తుంది అని.. ఇప్పుడు ప్రపంచంలో ఒక దేశంలో వెలుగు చూసిన వేరియంట్.. మరో దేశం లో కనిపించడం లేదన్నారు".
" ఈ విధంగా ముందుకు వెళితే మన బాడీ ఇమ్యూనిటీ తగ్గట్టు కరోనా ఏ దేశానికి ఆదేశంలోనే అంతమైపోతుంది అని.. ప్రస్తుతం సింగపూర్లో వెలుగు చూసిన ఎన్వి1.8.1 వేరియంట్ మరి వేరే ఏ దేశంలో లేదు అని.. అలాగే మన దేశంలో ఉన్న వేరియంట్ మరి వేరే దేశంలో లేదు అని.. ఇలా చూసుకుంటూ పోతే కరోనా వైరస్ బలహీన పడిపోయినట్లే అని చెప్పుకొచ్చారు. ఆయా దేశాల ప్రాంతాలలోని ప్రజల ఇమ్యూనిటీ పవర్ కు అనుగుణంగా అక్కడికే పరిమితం అవుతుంది అని "ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలోనే కరోనా అంతరించిపోయి రోజు రాబోతుంది అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిపై పరిశోధనలు చేస్తుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు . త్వరలోనే కరోనా ఎండమిక్ పై ప్రకటన రావచ్చు అంటూ కూడా తెలిపారు..!