
ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ బీపీలు వచ్చేస్తున్నాయి . ఒకప్పుడు 560 దాటితేనే బీపీ షుగర్ లు అంటూ వినే వాళ్ళము. కానీ ఇప్పుడు 25 దాటితే బీపీ 30 దాటితే షుగర్ 40 దాటితే గుండెపోటు అంటూ వినాల్సి వస్తుంది. దీనికి ప్రధానమైన కారణం లైఫ్ స్టైల్ . మరీ ముఖ్యంగా కూర్చున్న దగ్గర నుంచి కదలకపోవడం . గంటలు గంటలు కంప్యూటర్ల ముందు కూర్చుని వర్క్ చేస్తూ ఉండడం . బయట దొరికే ఫుడ్స్ ఎక్కువగా తింటూ ఉండడం. ఫాస్ట్ కల్చర్ ని ఎక్కువగా అలవాటు చేసుకుని ఫ్రైడ్ రైస్లు ఆయిల్ ఫుడ్స్ మసాలా ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్లే బిపి - షుగర్ లాంటివి త్వరగా వచ్చేస్తున్నాయి .
మరి ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అది ఆరోగ్యానికి మరింత ప్రమాదకరమైనవి అని సూచిస్తున్నారు డాక్టర్లు . సరిగ్గా లేని ఆహారపు పలవాట్లు కారణంగా అధిక రక్తపోటు వచ్చే సమస్య ఎక్కువగా ఉంటుంది . ఈ నేపథ్యంలోనే కొన్నిసార్లు గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి . అయితే బిపి ఎంత పెరిగితే గుండెపోటు వస్తుందో తెలుసా? ఆరోగ్య నిపుణుల ప్రకారం చాలామంది రోగులు అధిక రక్తపోటు వల్ల గుండెపోటుకు గురవుతున్నట్లు చెబుతున్నారు. రక్తపోటు సమస్యను సరిగ్గా నియంత్రంచకపోతే గుండెపోటు ప్రమాదం మరింత పెరుగుతుంది.
అంతేకాదు నిపుణుల ప్రకారం రక్తపోటు 180 / 120 మ్మ్హ్గ్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ను సంప్రదించాలి . అలాంటి సమయంలోనే గుండెపోటులు వస్తూ ఉంటాయి. ఈ సమయంలో మీ ఆరోగ్యం గురించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. హై బీపీ ఉన్నవారు ఆరోగ్య పైదృష్టి సాధించడం చాలా చాలా మంచిది . హెల్త్ చెకప్ డైలీ చేసుకుంటూ ఉండడం రక్తపోటు పెరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఒక బీపి మిషన్ ఇంట్లోనే పెట్టుకొని ఎప్పటికప్పుడు బీపి చెక్ చేసుకుంటూ ఉండాలి . అంతేకాదు మీ ఆరోగ్యం బాగుండాలి అంటే మీ ఆహారం మీ జీవన సైలీ పూర్తిగా మారాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా చాలా అవసరం..!