మార్చి 16వ తేదీన ఒక సారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో ప్రముఖుల మరణాలు... ఎన్నో ముఖ్య సంఘటనలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి.

 

 జేమ్స్ మాడిసన్ జననం : అమెరికా మాజీ అధ్యక్షుడు అయిన జేమ్స్ మాడిసన్ 1751 మార్చి 16వ తేదీన జన్మించారు. 

 

 మామిడి వెంకటార్యులు జననం : తొలి తెలుగు నిఘంటు కర్త అయిన మామిడి వెంకటార్యులు  1764 మార్చి 16వ తేదీన జన్మించారు. ఆంధ్ర దీపిక పేరుతో రాసిన నిఘంటువు తెలుగు భాషా చరిత్రలో ఒక నూతన ఒరవడికి నాంది పలికింది అని చెప్పాలి. మామిడి వెంకటార్యులు శబ్దార్థ కల్పతరువు మొదటగా అచ్చయిన  సంస్కృత నిఘంటువు. ఈయన ఎన్నో గ్రంథాలను రచించారు. తెలుగు వ్యాకరణంలో దంత్య తాళపత్రాలను వెంకటరమణ మొదలుపెట్టారు. ఎన్నో వేదాలను ఉపనిషత్తులను అధ్యయనం చేసేవారు.

 

 

 పొట్టి శ్రీరాములు జననం  : ప్రత్యేక ఆంధ్ర  రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవి అయిన మహాపురుషులు పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16వ తేదీన జన్మించారు. పొట్టి శ్రీరాములు ఆంధ్రులకు వ్రాత భాష ప్రయుక్త  రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. జాతిపిత మహాత్మా గాంధీ బోధించిన సత్యము అహింస హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు పొట్టిశ్రీరాములు.ఈయన స్వాతంత్ర ఉద్యమంలో ఎన్నో ఏళ్ల పాటు పోరాటం చేశారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్షను కూడా అనుభవించారు పొట్టి శ్రీరాములు. క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని మూడు సార్లు జైలు శిక్ష అనుభవించారు. పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీల మధ్య అనుబంధం ఎంతగానో ఉండేది. సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు చేసిన సేవ చరిత్రాత్మకమైనది. మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న నిరాహార దీక్ష ప్రారంభించారు. మామూలుగా ప్రారంభమైన దీక్ష క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. 

 

 ఆవుల సాంబశివరావు జననం : ప్రముఖ న్యాయవాది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త ప్రముఖ హేతువాది అయిన ఆవుల సాంబశివరావు 1917 మార్చి 16వ తేదీన జన్మించారు. సాంబశివరావు తొలినాళ్లలో సమాజంలో బానిసత్వం,  పేదరికం,  వెనుకబాటుతనం,  అంధత్వ  విశ్వాసాలు ఇవ్వని రోజు మార్చుకోవాలంటే కమ్యూనిస్టు భావజాలం శరణ్యమని భావించిన ఎం.ఎన్.రాయ్ స్పూర్తితో నవ్య మానవవాదం అవలంబించారు. మన సమాజంలో మానవత్వం వెలిగిస్తే చీకట్లు  అన్నీ తొలగిపోతాయి అంటూ భావించాడు ఆవుల సాంబశివరావు. 60 ఏళ్లకు పైగా ఏ పదవిలో ఉన్న ఏ చోట ప్రసంగించిన మానవత్వం శాస్త్రం తో విలీనం చేసారు. 

 

 ఉషశ్రీ జననం : ఉషశ్రీ గా పేరుగాంచిన రేడియో వ్యాఖ్యాత,  సాహిత్య రచయిత అయినా పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు 1928 మార్చి 16వ తేదీన జన్మించారు. 

 

 కె.బి.కె మోహన్ రాజు మరణం : సినిమా నేపథ్యగాయకులు ఆకాశవాణి దూరదర్శన్ కళాకారుడు అయిన కె.బి.కె మోహన్ రాజు  2018 మార్చి 16వ తేదీన మరణించారు. ఈయన పూర్తి పేరు కొండబాబు కృష్ణ మోహన్ రాజు. 

 

 శ్రీరంగం గోపాల రత్నం మరణం : ఆకాశవాణిలో శాస్త్రీయ మరియు లలిత సంగీత గాయకురాలు అయిన శ్రీరంగం గోపాలరత్నం 1993 మార్చి 16వ తేదీన మరణించారు. అన్నమయ్య పదాలు, క్షేత్రయ్య పదాలు,  మీరా భజన గీతాలు మొదలైనవి ఈమె  ఆలపించిన పాటల్లో ఎంతో  ప్రాచుర్యం పొందాయి. 1992 లో ఈమెను  భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: