ఆగస్టు 8వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు సంభవించిన మరణాలు జరిగిన ముఖ్య సంఘటనలు ఏంటో తెలుసుకుందాం రండి.


 చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి జననం : అవధాన విద్యకు రూపురేఖలు తీర్చిదిద్ది వన్నెవాసి సమకూర్చిన తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి 1870 ఆగస్టు 8వ తేదీన జన్మించారు. ఈయన  అవధానిగా నాటకకర్తగా ఎంతగానో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. వీరి శిష్యులు తరువాత కాలంలో సాహితీరంగంలో భాషాశాస్త్రంలో ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. తిరుపతి వేంకట కవులుగా పని చేసిన అవధానాలు క్రమేపి తెలుగు నాటక అష్టావధానాలు శతావధానాలు గా ప్రజాదరణ పొందారూ.


 పిల్లి సుభాష్ చంద్రబోస్ జననం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత అయిన పిల్లి సుభాష్  చంద్రబోస్ 1950 ఆగస్టు 8వ తేదీన జన్మించారు. తూర్పుగోదావరి జిల్లా వాసి అయిన పిల్లి సుభాష్ చంద్రబోస్... రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి.. ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత అయిన పిల్లి సుభాష్ చంద్రబోస్ శాసన మండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో రెండుసార్లు... రోశయ్య  మంత్రివర్గంలో ఒకసారి మంత్రిగా పనిచేశారు పిల్లి సుభాష్ చంద్రబోస్.



 రోజర్ ఫెడరర్ జననం : స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెడరర్ 1981 ఆగస్టు 8వ తేదీన జన్మించారు. 2004 ఫిబ్రవరి 2 నుంచి వరుసగా రెండు వందల ముప్పై ఏడు వారాల పాటు ప్రపంచ నెంబర్వన్ గా నిలిచినా ఆటగాడు రోజర్ ఫెడరర్. టెన్నిస్ క్రీడా  ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లలో రోజర్ ఫెడరర్  ఒకరు. ఇప్పటివరకు టెన్నిస్ క్రీడలో 20 గ్రాండ్ స్లామ్స్  టెన్నిస్ టైటిల్ ను  కైవసం చేసుకున్నారు రోజర్ ఫెడరర్. అంతే కాకుండా ఎన్నో టైటిల్ లను  సైతం గెలుచుకున్నారు. ఇక తన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు రోజర్ ఫెడరర్. అయితే యువ ఆటగాళ్ల రాకతో  అతని పని అయిపోయింది అని అందరూ అనుకుంటున్న తరుణంలో ఇంకా మిగిలి ఉంది అని... విజయంతో నిరూపించిన గొప్ప ఆటగాడు రోజర్ ఫెడరర్.



 వైయస్ వివేకానంద రెడ్డి జననం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి 1950 ఆగస్టు 8వ తేదీన జన్మించారు. ఈయన భారత పార్లమెంటు సభ్యుడు. 13,  14వ లోక్సభ లకు కడప లోక్సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు వైఎస్ వివేకానందరెడ్డి, అంతేకాకుండా ఓసారి పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిన్న తమ్ముడు ఈయన. 2019 మార్చి 15వ తేదీన వైయస్ వివేకానంద రెడ్డి హత్య చేయబడ్డారు.


 గురజాడ రాఘవ శర్మ మరణం : స్వాతంత్ర సమరయోధులు కవి బహుగ్రంధకర్త అయిన గురజాడ రాఘవ శర్మ 1987 ఆగస్టు 8వ తేదీన పరమపదించారు. ఎంతో ఉత్తేజకరమైన రచనలు కవితల ద్వారా భారత దేశ ప్రజల్లో  స్వతంత్ర కాంక్ష రగిలించారు గురజాడ రాఘవ శర్మ. బొమ్మెర పోతన తనకు ఎంతో ఉత్తేజాన్ని నింపారు అని చెబుతూ ఉంటారు గురజాడ రాఘవ శర్మ. ఇక ఈయన రచనలు కవితలనే ఆయుధాలుగా  బ్రిటిష్ వాళ్ళ పై పోరాటం చేసేవారు.



 సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ మరణం : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు సంఘసేవకురాలు అయిన సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ 2010 ఆగస్టు 8 వ తేదీన పరమపదించారు. అండమాన్ వెళ్లి నేతాజీ విగ్రహ ప్రతిష్టాపన లో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధురాలు ఈమె. మహిళా ఉద్యమాలు ఖద్దరు  ప్రచారంలో మద్యపాన వ్యతిరేక ఉద్యమాల్లో  ఎంతగానో కీలక పాత్ర వహించారు. మల్లాది సుబ్బమ్మ లాంటి పోరాటయోధుల తో కలిసి మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడారు సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ,

మరింత సమాచారం తెలుసుకోండి: