గ‌డిచిన‌ కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో జ‌న‌వ‌రి 16వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు

1967: గోవా, డామన్, డయ్యూలు యూనియన్ టెరిటరీగా ఉంటుందా, మహారాష్ట్రలో కలిసిపోతుందా అని తెలుసుకోవటానికి ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) జరిగింది. యూనియన్ టెరిటరీ గానే, కొనసాగుతామని, ఈ ప్రాంతాల ప్రజలు వెల్లడించారు. 30 మే 1987 న గోవాకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది.
2010: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌గా ఇ.ఎస్.ఎల్.నరసింహన్ నియమించబడ్డాడు.

ప్ర‌ముఖుల జననాలు

1924: పరుచూరి హనుమంతరావు, ప్రగతి ప్రింటర్స్‌ స్థాపకుడు.ఆఫ్‌సెట్‌ ముద్రణాయంత్రం కంప్యూటర్‌ కంట్రోల్స్‌తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. [మ. 2015]
1942:  జైపాల్ రెడ్డి.కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి 1969, 1984 మధ్య నాలుగు సార్లు ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు ఎన్నికయ్యాడు. ముందుగా కాంగ్రెసు పార్టీ సభ్యునిగా ఉన్నా, అత్యవసర పరిస్థితి నివ్యతిరేకిస్తూ 1977లో జనతా పార్టీలో చేరాడు. ఆ పార్టీలో 1985 నుండి 1988 వరకు జనరల్ సెక్రటరీగా వ్యవహరించాడు. ఇతను భారత పార్లమెంటుకు మొదటిసారిగా 1984లో మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. తరువాత భారత పార్లమెంటుకు మిర్యాలగూడ లోకసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా 1999, 2004లలో రెండు సార్లు ఎన్నికయ్యాడు. రాజ్యసభ సభ్యునిగా 1990, 1996 లలో రెండు సార్లు ఎన్నుకోబడ్డాడు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా 1991-1992 లో ఉన్నాడు. రెండు సార్లు సమాచార, ప్రసార శాఖా మంత్రిగా పనిచేశాడు. జైపాల్ రెడ్డి చట్ట సభలలో చేసిన డిబేట్లు అత్యంత కీలకమైనవిగా ఉంటాయి. ఇతను అత్యుత్తమ పార్లమెంటేరియన్ గా 1998లో ఎన్నుకోబడ్డాడు.


ప్ర‌ముఖుల మరణాలు

1901: మహాదేవ గోవింద రనడే, భారత జాతీయోద్యమ నాయకుడు.
1938: కోడి రామమూర్తి, మల్ల వీరుడు, కలియుగ భీముడు బిరుదు పొందిన ఆంధ్రుడు.విజయనగరంలో పొట్టి పంతులు అనే మిత్రుని సహకారంతో సర్కస్ కంపెనీ నెలకొల్పాడు. తుని రాజాగారి నుండి సంపూర్ణ సహకారం లభించింది. రామమూర్తి సర్కస్ సంస్థ పలుచోట్ల ప్రదర్శనలిచ్చి మంచిపేరు తెచ్చుకున్నది. తెలుగు జిల్లాల్లో ప్రదర్శనల తర్వాత 1912లో మద్రాసు చేరాడు. పులులు, ఏనుగులు, గుర్రాలు, చైనా, జపాన్ కళాకారుల సహకారం ఆయనకు లభించాయి. రామమూర్తి ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి.
1943: త్రిపురనేని రామస్వామి, సంఘసంస్కర్త, కవిరాజు. (జ.1887)
1988: ఎల్.కె.ఝా, భారతదేశపు ఆర్థిక వేత్త, భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్ గా పనిచేసిన 8 వ వ్యక్తి. (జ.1913)
2016: అనిల్ గంగూలీ బాలీవుడ్ దర్శకుడు, రచయిత. (జ.1933)

మరింత సమాచారం తెలుసుకోండి: