కొంతమంది జీవితంలో ప్రతి విషయానికీ భయపడుతుంటారు.. ఏ వార్త విన్నా దాన్ని తమ జీవితానికి అన్వయించుకుని భవిష్యత్ పై బెంగ పెట్టుకుంటారు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో అన్న భయంతో బతుకుతుంటారు. కానీ మనిషికి ఎక్కువగా నష్టం చేసేది ఆ వార్తల్లోని విషయం కాదు.. వారిలో చోటు చేసుకుంటున్న భయాందోళనలే.

 

 

అదేంటి.. అలాంటి వార్తలు వింటే భయపడకుండా ఎలా ఉంటాం.. అయినా ఇది భయం కాదు.. భవిష్యత్ పట్ల జాగ్రత్త అని కూడా వారు వాదిస్తుంటారు. అవును నిజమే. వారి వాదనలో కూడా నిజం ఉంది. కానీ ఇక్కడే అసలు విషయం కూడా దాగి ఉంది. భయానికి- భవిష్యత్ పట్ల జాగ్రత్తగా ఉన్న తేడా.. విభజన చాలా పల్చనైంది.

 

 

భవిష్యత్ పట్ల ప్రతి ఒక్కరికీ జాగ్రత్త ఉండాల్సిందే. ఎందుకంటే.. అదే వాస్తవం కాబట్టి. కానీ ఆ జాగ్రత్తకూ కొన్ని హద్దులు ఉంటాయి. కానీ ఈ భయం అన్నది విచక్షణను చంపేస్తుంది. మన ఆలోచనాశక్తిని బలహీనపరుస్తుంది. అనవసర ఆందోళలకు దారి తీస్తుంది. అక్కడే మనసు గాడి తప్పుతుంది.

 

 

మరో విషయం ఏంటంటే.. మనం భయపడినంత మాత్రాన జరగాల్సిందేమీ జరగకుండాపోదు.. జరిగి తీరుతుంది. మనం చేయాల్సింది సమగ్ర విశ్లేషణ. మనం భయపడే అంశం అసలు వాస్తవం ఏంటి.. మనం ఎంత వరకూ ప్రభావితం అవుతాం. దీన్నుంచి తప్పించుకునేందుకు మనకు ఎలాంటి దారులు ఉన్నాయి. ఇలా విషయం పరంగా విశ్లేషించుకుంటే అనవసర భయాందోళనలకు ఆస్కారం ఉండదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: