
తీవ్రమైన ఎండల వల్ల శరీరం డీ హైడ్రేషన్‌కు గురవుతుంది. దీంతో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి రాకూడదంటే మన శరీరాన్ని చల్లబరిచే పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి.. అవి ఇవే..
కొబ్బరి నీళ్లు: ఎండ తీవ్రత విపరీతంగా ఉన్నప్పుడు ఒక్కోసారి అకస్మాత్తుగా ఒళ్లంతా నిస్సత్తువగా మారుతుంది. నీరసం ఆవహిస్తుంది. ఇలాంటి సందర్భంలో కొబ్బరి నీళ్లు తాగితే తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
షర్బత్: వేసవిలో బాడీని డీ హైడ్రేషన్ నుంచి కాపాడుకోవడంలో షర్బత్ బాగా పనిచేస్తుంది. గ్లాసెడు నీళ్లలో సగం నిమ్మకాయ పిండుకుని రెండు టీ స్పూన్ల చక్కెర కలుపుకుని షర్బత్ చేసుకుని తాగొచ్చు.
జల్జీరా: నాలుగు చెంచాల ఆమ్చూర్ పొడి, అంతే పరిమాణంలో మెంతి పొడి, అర చెంచా వేయించిన జీలకర్ర పొడి, రెండు చెంచాల నల్ల ఉప్పు, చక్కెర, అర చెంచా మిరియాల పొడి కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చల్లటి నీళ్లలో కలిపితే జల్జీరా మిశ్రమాన్ని చేసుకొని తాగితే ఎండ వేడిమి నుంచి బయటపడొచ్చు..
చల్ల: పెరుగులో కావాల్సినన్ని నీళ్లు పోసుకుని గిలకొట్టి చల్ల చేసుకోవాలి. ఈ చల్లలో నిమ్మ ఆకులు వేసి, కొంచెం ఉప్పు, కరివేపాకు చేర్చి తాగితే ఒంట్లో వేడి దెబ్బకు తగ్గిపోతుంది.. ఇది అతి తక్కువ ఖర్చుతో కూడిన ది .. మంచి ఆరోగ్య ఫలితం ఉంటుంది..
పైన తెలిపిన వాటిలో ఏ ఒక్కటి తీసుకున్న కూడా శరీరం వేడి తగ్గుతుంది..