ప్లాస్టిక్ వినియోగం మానవ నాశనానికి దారితీస్తుందని తెలిసినప్పటికీ దాని వినియోగం మాత్రం పెరుగుతూనే వస్తుంది. అయితే అది వాడటం వలన కాన్సర్ లాంటి భయంకరమైన సమస్యలు తలెత్తుతాయనేది అనుమానమా లేక నిజామా అనేదాని గురించి ఎంతమందికి తెలుసు. ఇక దీనివినియోగం విపరీతంగా చేస్తున్నది మాత్రం సంస్థలే. నేడు ఏ వస్తువు ను ప్యాకింగ్ చేయాలన్నా ముందుగా ప్లాస్టిక్ గుర్తుకువస్తుంది. ఇన్ స్టెంట్ ఆహారం నుండి ఇంట్లో వాడుకునే అనేక వస్తువుల వరకు ఈ ప్లాస్టిక్ మానవ జీవన విధానంలో పూర్తిగా విస్తరించింది. ఈ స్థాయికి దాని వాడకం పెరిగిన తరువాత భవిష్యత్తులో వచ్చే సమస్యలు తెలిసి వస్తుండటంతో ఇటీవల దీని వాడకం నిషేదించాలని ప్రపంచ దేశాలు ప్రచారాలు మొదలు పెట్టాయి.

ఇక ఎన్నో సంస్థలు మనిషికి ప్రధాన అవసరాలైన నీరు, ఆహారాన్ని కూడా ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేసి మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. అనేక కారణాలతో చాలా వరకు వీటికి డిమాండ్ కూడా పెరిగిపోయింది. వీటిని కొన్నప్పుడు దానిపై ఉన్న ఎక్స్ పైరీ డేట్ చేసుకొని కొనాల్సిందిగా వినియోగదారులకు సూచనలు కూడా చేశారు. అయితే అవన్నీ పట్టించుకోకుండా వాటి వినియోగం జరుగుతూనే ఉంది. ఎక్కడో కొందరు ఈ నియమాలు పాటిస్తున్నారు. డేట్ అయిపోయిన ఆహారం తీసుకున్నా ఏమీ కాదనేది కొందరి ఆలోచన. అయితే అలాంటి ఆహారం తీసుకోవడం వలన దుష్ఫలితాలు వెంటనే రాకపోవచ్చు కానీ ప్రమాదమే అంటున్నారు నిపుణులు. పిల్లలు కూడా వీటిని పట్టించుకోకుండా లోనికి తీసేసుకుంటూ అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. వ్యాపారులు కూడా తాము కొన్న స్టాక్ అమ్ముకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప వినియోగదారుల ఆరోగ్యం గురించి ఆలోచించడం లేదు. అందుకే అప్పుడప్పుడు నాణ్యత శాఖ అధికారులు దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేసి డేట్ దాటిన పదార్దాలు అమ్మేస్తున్న వారికి జరిమానా కూడా విధిస్తున్నారు.  

అసలు ఈ ఎక్స్ పైరీ తేదీ ఎందుకు ముద్రిస్తారు అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అది కేవలం ప్యాకింగ్ చేసే వనరు బట్టి మరియు అందులో ఉన్న పదార్దాలను బట్టి ఉంటుందని నిపుణులు చెపుతున్నారు. అంటే ప్యాకింగ్ కోసం ప్లాస్టిక్ మెటీరియల్ వాడితే ఆ ప్లాస్టిక్ నాణ్యతను బట్టి మరియు అందులో ఉన్న పదార్దాన్ని బట్టి ఈ తేదీని నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఒక ప్లాస్టిక్ వాటర్ బోటిల్ తీసుకుందాం. దానిపై ఎక్స్ పైరీ తేదీ ఉంటుంది. అది కేవలం ప్లాస్టిక్ కోసం మాత్రమే. సదరు తేదీ అయిపోతే ఆ ప్లాస్టిక్ మెటీరియల్ వెంటనే రసాయనాలను విడుదల చేస్తుంది. అంటే తేదీ అయిపోయిన వాటర్ బాటిల్ కొని తాగితే ఆ నీటిలో ప్లాస్టిక్ బాటిల్ విడుదల చేసిన రసాయనాలు కలిసి ఉన్నట్టే, అది తాగితే అనారోగ్యం సంభవిస్తుంది. ఇది నిజమైన ఎక్స్ పైరీ తేదీ కధ. ఇక నుండి ఆ తేదీ గమనించి మీరు, మీ వాళ్ళ కు ఆయా పదార్దాలు కొనివ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి: