ఏ వంటింట్లో నైనా ఎక్కువగా వాడేటువంటివాటిలో గరం మసాలా కూడా ఒకటి. కొన్ని వాటిలోకి ఈ గరంమసాలా కలపడం వల్ల మరింత టేస్ట్ రావడం జరుగుతుంది. అయితే వీటిని గరంమసాలా అని ఎందుకు పిలుస్తారు తెలుసా.. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

గరంమసాలా భారతదేశంలోనే అత్యధికంగా ఉపయోగిస్తారట. గరంమసాలాని ఓకేనా కొన్ని మసాలా మిశ్రమాన్ని కలపడం వల్ల వాటిని గరంమసాలా అంటారు. ఇందులో ముఖ్యంగా 15 రకాలు కలిగినటువంటి మసాలాలను కలుపుతారు. అందుచేతనే అది అంత రుచిగా ఉంటుంది అని కొంతమంది పరిశోధనలు చేసి తెలియజేశారు. మనకు దొరికే ఎటువంటి ఎటువంటి మసాలా అయినా ఏదో ఒక వ్యాధిని నయం చేయడానికి సహాయం చేస్తుందట.


ముఖ్యంగా ఎండు మిరపకాయలను మనం వేయించి గరం మసాల లోకి వేసినట్లయితే సులభంగా జీర్ణమవుతుందట. ముఖ్యంగా ఆహారం లోకి వేసేటప్పుడు.. తగినంత మాత్రమే వేసుకోవాలి. ఇది వంట వండే టప్పుడు మధ్యలో వేయకూడదు. అలా వేసినట్లు అయితే ఆహారం రుచి కోల్పోతుందట. కొంతమంది శాస్త్రవేత్తలు తెలిపిన ప్రకారం ఈ గరం మసాలా వాడడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత ఎక్కువగా పెంచడంలో బాగా దోహదపడుతుంది. అందుచేతనే ఈ మసాలా కీ ముందు గరం అనే పదాన్ని ఉపయోగించారట. ఇది ఎటువంటి కూరలలో కైనా ఉపయోగించుకోవచ్చు.

ఒకవేళ మనమే సొంతంగా తయారు చేసుకోవాలంటే.. అందుకోసం జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండుమిర్చి, పెద్ద యాలకులు అన్నింటిని మిక్స్ చేసి పొడిగా మార్చుకోవాలి. ఇక వీటితో పాటే జాజికాయను బాగా మెత్తని పౌడర్ గా చేసి అందులో కలుపుకోవాలి. ఇక మనం వాడే ఎటువంటి కూర లోకి మసాలా తో పాటు, అందులోకి కొంచెం పసుపును వేసి నట్లు అయితే.. క్యాన్సర్ కణాలను తొలగించడంలో బాగా సహాయపడుతుంది.

అంతేకాకుండా వీటిని కలపడం వల్ల గ్యాస్ వంటి సమస్య ఉండ కుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: