కొత్త వైర‌స్లు వ‌చ్చి కొత్త వేరియంట్లు వ‌చ్చి ఆస్ప‌త్రుల‌పై ఒత్తిడి పెంచుతున్నాయి.. నోట్ల క‌ట్ట‌ల వినిమ‌యంను దుర్వినియోగం చేస్తున్నాయి.. ఆస్ప‌త్రిలో నోటు మాట్లాడితే నోట మాట ఒక‌టి క‌దలాడి తీరుతోంది. అందుకే డ‌బ్బు మాత్ర‌మే వైద్యాన్ని దాని విలువ‌ను,  వైద్యం మాత్ర‌మే డ‌బ్బు విలువ‌ని చాటి చెప్పేందుకు ఎన్నో సార్లు పోటీ ప‌డ్డాయి. ఈ పోరులో గెలిచింది ఆఖ‌రికి వ‌ర‌కూ ఉండేది కూడా డ‌బ్బే క‌నుక కొత్త వేరియంట్లుతో జాగ్ర‌త్త.. డ‌బ్బున్నోళ్లతో పాటు డ‌బ్బులేని వారు, డ‌బ్బు అర‌కొర‌గా ఉన్న వారు కూడా జాగ్ర‌త్త. ప్రాణం నిలుపుకునే బాధ్య‌త‌లో భాగంగానే అంతా ఇలా జీవితాన్ని నెట్టుకురావ‌డం నైరాశ్యాన్ని ప్రేమించ‌డం కూడా ఓ జీవ‌న విధానం కావ‌డం అన్న‌వి మ‌న ముందున్న విధానాలు. క‌నుక వినాశ‌న కాలాల చెంత వైద్యం కూడా కొన్ని సార్లు విప‌రీత అర్థాన్నీ మ‌రియు బుద్ధినీ చాటి చెబుతుంది. మ‌నం అన్నింటినీ  గ‌మ‌నించి గుర్తించి జీవితాన్ని ఆరోగ్య వంతం చేసుకోవ‌డం సార‌వంతం చేసుకోవ‌డం అన్న‌వి ముఖ్య‌మ‌యిన ప‌నులుగా గుర్తించాలి. అప్పుడే కొంత‌లో కొంత వైద్యం పొందిన మ‌నిషికి., ఆరోగ్యంగా ఉన్న మ‌నిషికి సాంత్వన‌.. సంతోషం కూడా!

ఆధునికంలో అంతా మామూలే! మ‌నిషి ఓడిపోవ‌డం మ‌నిషి ఒంటరయిపోవ‌డం మ‌నిషికి ఏమీ లేకుండా పోవ‌డం అన్న‌వి మామూ లుగా కాదు అతి సాదాసీదా విష‌యాలుగానే మిగిలిపోతున్నాయి. బ‌తుకీడుస్తున్నాయి. ఆ క్ర‌మంలో గెలుపు అన్న‌ది ఓ విరుద్ధ ప దంలో ఆట మొద‌లుపెట్టి కాలంతో దోబూచులాడుతోంది. కనుక గెల‌వ‌డం క‌న్నా గెలుపును గుర్తు పెట్టుకుని మ‌రింత రాణించ‌డంలో ఉన్న ఆత్మ విశ్వాస ధోర‌ణి ఓ గొప్ప మార్పున‌కు సంకేతం అయి ఉంటుంది. డ‌బ్బులు ఉన్నా లేకున్నా మ‌నిషి ఆధునిక కాలంలో ఓడిపోనంత వ‌ర‌కూ అత‌డి విశ్వాసాలు న‌మ్మ‌కాలు ఓడిపోనంత వ‌ర‌కూ ఆయ‌న ప్ర‌య‌త్నం ఒక‌టి స‌జీవమే! కానీ క‌రోనా లాంటి విజృంభ‌ణల త‌రువాత వ్యాధి కార‌కాల వ్యాప్తి రోజురోజుకీ పెరిగిపోతున్నాక ఆధునిక వైద్యం అంతా ఆ ధ‌నిక వైద్యం అంతా మ‌నుషుల‌ను ప్రేమించడం మానుకుని చాలా కాల‌మైంది.



అందుకే హాస్పిట‌ళ్లు అన్నీ మాన‌వ‌త‌ను మ‌రిచి త‌మ ఆవ‌ర‌ణ‌లోకి వ‌చ్చిన కేసుల‌న్నింటినీ నోట్ల క‌ట్ట‌ల‌తో తూచి పంపుతున్నాయి. ఖ‌రీద‌యిన జీవ‌న శైలి కార‌ణంగానే ఖ‌రీద‌యిన జ‌బ్బులు వ‌స్తున్నాయ‌న్నది కూడా ఇవాళ ఓ వాస్త‌వం. ముంద‌స్తు చర్య‌లు లేని స‌మాజంలో ముంద‌స్తు జాగ్ర‌త్త కు ప్రాధాన్యం ఇవ్వ‌ని స‌మాజంలో మ‌న‌కు జ‌బ్బులు ఎక్క‌డి నుంచో వ‌చ్చి ఇక్క‌డికి వాలడం అన్న‌ది పెద్ద వింతేం కాదు.. ఓ ప్ర‌తిపాద‌న ప్ర‌కారం అది త‌ప్పు కాదు.. అభివృద్ధిని వ‌ద్ద‌నుకుంటే జ‌బ్బులు కూడా వ‌ద్దు అని అనుకోవ‌డ‌మే బెట‌ర్.. అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక వృద్ధిలో భాగంగా చేస్తున్న నేరాలు కూడా ఈ జ‌బ్బుల్లో ఓ భాగ‌మే కావొచ్చు. క‌నుక డ‌బ్బులు మంచివి మ‌నిషి మంచోడు కాదు.. జ‌బ్బుల‌న్నీ మంచివి మ‌నిషే మంచోడు కాదు కాబోడు కూడా!




మరింత సమాచారం తెలుసుకోండి: