
ఇక పోతే ఎలాంటి వ్యాధులు వస్తాయి.. వాటిని ఎలా గుర్తించ గలగాలి అనే విషయానికి వస్తే.. మొదటిది మధుమేహం.. ఇది వచ్చే ముందు దృష్టి అస్పష్టంగా కనిపిస్తుంది. టైపు 2 డయాబెటిస్ తో దృష్టికి సంబంధం కలిగి ఉంటుంది. ఇక ఇది ఎలా సాధ్యం అంటే దీర్ఘకాలిక అధిక రక్త చక్కెర స్థాయిలు రక్తనాళాల్లో అసౌకర్యాన్ని కలిగించినప్పుడు కళ్ల వెనుక భాగంలో రక్తం ముఖ్యమైన మచ్చల లా కనిపిస్తుంది. ఇక ఇలా కళ్ళలో రక్త స్రావం జరిగితే రక్తంలో చక్కెర స్థాయి తీవ్రమైన స్థాయికి చేరుకుందని గుర్తించాలి. ఇక అందుకే ఇలా కనిపించినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించడం ఉత్తమం అయిన పని..
అంతేకాదు రొమ్ము క్యాన్సర్ లక్షణాలను కూడా మనం కళ్ల ద్వారా గుర్తించవచ్చు. శరీరంలో క్యాన్సర్ కణాలు ఇతర భాగాలకు వ్యాప్తి చెందినప్పుడు ఈ లక్షణాలు మన కళ్ల ద్వారా కనిపిస్తాయి. ముఖ్యంగా యువియా వంటి కంటి వ్యవస్థలోని అసాధారణ గాయాలు లేదా కణితులు కంటికి క్యాన్సర్ కణాలు వ్యాపించాయని సూచించడం జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు ఒక అస్పష్టమైన ద్రుష్టి తో పాటు కంటి నొప్పి కూడా మీకు కలుగుతుంది.